అసలు దేశాన్ని నాలుగైదేళ్లుగా కాస్టింగ్ కౌచ్ ఉదంతం ఎలా ఊపేస్తుందో చూస్తూనే ఉన్నాం. కంగనా రనౌత్‌తో మొదలు పెడితే ఎంతో మంది హీరోయిన్లు, లేడీ సింగర్లు, లేడీ ఆర్టిస్టులు, బుల్లితెర హీరోయిన్లు, నటీమణులు తాము కెరీర్లో ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి ఓపెన్‌గానే చెప్పారు. అసలు ఇదో పెద్ద సంచలనం అయిపోయింది. ఎవరికి వారు ధైర్యంగా లైంగీక వేధింపుల గురించి చెపుతుండడంతో వారిని చూసి చాలా మంది ఇతర రంగాల్లో ఉన్న వారు కూడా లైంగీక వేధింపుల బాధలు చెప్పుకున్నారు.
అయితే ఇదంతా నాణేనికి ఒక వైపున మాత్రమే ఉంది. కేవలం మహిళలు మాత్రమే లైంగీక వేధింపుల బాధితులు కాదు. సినిమా రంగంలో మగవాళ్లు కూడా ఇలాంటి బాధితులు ఉన్నారట. కొద్ది రోజుల క్రితమే సీనియర్ అయిన దివంగత నటుటు అమ్రీష్‌పురి మనవడు తాను కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ఛాన్సుల కోసం తనను కొందరు మగవాళ్లే కాంప్రమైజ్ కావాలని.. కోరికలు తీర్చాలని వేధించడంతో తాను అలాంటి పనులు చేయనని చెప్పి తప్పించుకున్నానని చెప్పాడు.
అయితే ఇప్పుడు ఆ లిస్టులోకే మరో బాలీవుడ్ నటుడు కూడా వచ్చి చేరాడు. సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్ 16 సీజన్ నుంచి అంకిత్గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. సీరియల్స్‌తో పాపులర్ అయిన అంకిత్‌కు బిగ్‌బాస్‌లో ఛాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కూడా కెరీర్ స్టార్టింగ్‌లో కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎందురైందని చెప్పాడు.
ఒక వ్యక్తి తనను కాంప్రమైజ్ అవుతావా ? అని అడగడంతో పాటు ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లంతా ఇలా చేసి తర్వాత స్టార్లు అయ్యారని కూడా తనతో చెప్పాడని అంకిత్ తెలిపాడు. పెద్ద పెద్ద సెలబ్రిటీల పేర్లు చెప్పి తనను లాంచ్ చేస్తానన్నాడని… ఈ స్టార్టు అంతా త్యాగాలు చేస్తేనే ఈ స్థాయికి వచ్చారని కూడా ఆ వ్యక్తి తనపై ఒత్తిడి చేసినట్టు చెప్పాడు.
అదంతా తన వల్ల కాదని చెప్పినా కూడా అతడు వినిపించుకోలేదని.. అతడే తనను అసభ్యంగా తాకేందుకు ట్రై చేశాడని… వెంటనే తాను అక్కడ నుంచి వెల్లిపోయానని.. ఇదే తన జీవితంలో అత్యంత చెత్త సంఘటన అని అంకిత్ చెప్పాడు.