Moviesబ్రేకింగ్: పూర్తిగా క్షీణించిన విజయ్ అంటోనీ ఆరోగ్యం..హెల్త్ కండీషన్ క్రిటికల్..!?

బ్రేకింగ్: పూర్తిగా క్షీణించిన విజయ్ అంటోనీ ఆరోగ్యం..హెల్త్ కండీషన్ క్రిటికల్..!?

కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న విజయ్ అంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ ఆ సినిమాలోని తెలుగులో ను డబ్ చేస్తూ తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని . రీసెంట్గా బిచ్చగాడు 2 అనే సినిమా షూటింగ్లో గాయాలపాలైయ్యాడు . మనకు తెలిసిందే ఆయన నటించిన బిచ్చగాడు సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.

మరీ ముఖ్యంగా తమిళ్ కన్న తెలుగులో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకురావడంతో మేకర్ బిచ్చగాడు 2 కి ప్లాన్ చేశారు . ఈ క్రమంలోనే బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ కోసం మలేషియా వెళ్ళిన చిత్ర బృందం ..అక్కడ షిప్ లో షూటింగ్ చేస్తూ ఉండగా ఊహించిన విధంగా విజయ్ ఆంటోని పయనిస్తున్న షిప్ ప్రమాదానికి గురైంది . ఈ క్రమంలోనే విజయ్ ఆంటోని తలకు తీవ్రంగా గాయాలైనట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు హుటా హుటినా విజయ్ ఆంటోనీ ను హాస్పిటల్ కు తరలించగా ఆయనకు చికిత్స అందించిన డాక్టర్స్ 24 గంటలు గడిస్తే గాని పరిస్థితి ఏం చెప్పలేమంటూ చెప్పకు వచ్చారట . అంతేకాదు ఇప్పటికే విజయ్ అంటోని కుటుంబం మలేషియా చేరుకునింది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ అంటోని ఇంతవరకు స్పృహలోకే రాలేదని.. ఆయన తలకు బలమైన గాయం కావడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Thamilarasan (2022)

అంతేకాదు ఇప్పటివరకు విజయ్ ఆంటోని కుటుంబ సభ్యులకు కూడా ఆయన హెల్త్ కండిషన్ పై ఏ విధంగా స్పందించకపోవడంతో హెల్త్ కండిషన్ క్రిటికల్ గా ఉంది అంటూ వస్తున్న వార్తలపై ఫ్యాన్స్ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు . చిత్ర బృందమైన , కుటుంబ సభ్యులైన ఆయన ఆరోగ్యం పై క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ కు కొంచెం ఉపశమనం లభిస్తుంది అంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news