ఎట్టకేలకు ఊరిస్తూ వస్తోన్న యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళుతోంది. వచ్చే యేడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే ఈ సినిమా కోసం ఇప్పటి నుంచి చూసుకున్నా 16 నెలల పాటు వెయిట్ చేయాలి. ఈ యేడాది మార్చిలో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ నుంచి మరో సినిమా వచ్చేందుకు రెండేళ్లకు పైగా వెయిట్ చేయాల్సి వస్తోంది.
ఫ్యాన్స్‌కు ఇది ఓ రకంగా డిజప్పాయింట్ చేసే అంశమే. అయినా తప్పని పరిస్థితి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించే ప్లాన్ చేస్తోన్న కొరటాల అందుకు తగినట్టుగానే టీంను కూడా సెట్ చేసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కొరటాల అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చున్నాడు. తనకు నచ్చిన విధంగా కొరటాల మ్యూజిక్ చేయించుకుంటున్నాడట.
ఇక మరోవైపు ప్రి ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా నడుస్తున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. ఇందుకోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ కోసం ట్రై చేస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ తారక్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీ కొట్టే విలన్‌గా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ను తీసుకున్నారని రూమర్స్ వినిపించాయి. సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి అదిరిపోయే ట్విస్ట్ బయటకు వచ్చింది. ముందుగా అతిలోక సుందరి శ్రీదేవి పేరు వినిపించింది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఆమెను సైడ్ చేసేశారనే అంటున్నారు.
బాలీవుడ్ బ్లాక్ బ్యూటీ, హాట్ గర్ల్ దీపికా పదుకొణేను హీరోయిన్గా తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జాన్వీయే స్వయంగా తాను ఎన్టీఆర్ పక్కన నటించాలని అనుకుంటున్నట్టుగా చెప్పింది. కొరటాల కూడా ఆమెతో చర్చలు జరిపారన్న వార్తలతో అందరూ ఆమెనే హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు జాన్వీ కంటే కూడా సినిమాకు మరింత హైప్ ఉండాలంటే దీపికా పదుకొణే బెస్ట్ అని ఫిక్స్ అయ్యారట. ఏదేమైనా ఎన్టీఆర్ – దీపికా జోడీ అంటే మామూలు సెన్షేషనల్ కాదు.