కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న సినిమా వారసుడు . తమిళంలో వారీసు అనే పేరుతో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . కాగా సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన ఈ సినిమాను గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే . నిన్న మొన్నటి వరకు కూడా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి కాంప్రమైస్ కానీ దిల్ రాజు కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు .
దానికి మెయిన్ రీజన్ జనవరి 12వ తేదీన నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా ..ఆ తర్వాత రోజునే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అవుతుండడమే అని చెప్పుకొచ్చాడు . బాక్స్ ఆఫీస్ వద్ద రెండు బిగ్ సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో డిస్టర్బ్యూటర్లు నిర్మాతలు బాగుండాలని నష్టపోకూడదు అన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు .
“మా సినిమాపై ఎంతో నమ్మకం ఉంది ..వెనక్కి తగ్గిన సరే కలెక్షన్స్ పరంగా జనాలను ఎంటర్టైన్ చేసే పరంగా ముందుంటుంది . కానీ తమిళ్లో మాత్రం యధావిధిగా జనవరి 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది “అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో సంక్రాంతి వార్ నుండి కోలీవుడ్ హీరో ఓఉట్ అయ్యాడు. సంక్రాంతి పోటీల్లో చిరంజీవి-బాలయ్య మధ్య టాప్ ఫైట్ నెలకొంది . చూడాలి మరి వీరయ్య వ్స్ వీర సిమ్హా రెడ్డి లో ఎవరు సంక్రాంతి హీరోగా నిలబడతారో..?