బుల్లితెర పాపులర్ యాంకర్ రష్మీ అంటే ఇప్పుడు తెలుగు జనాల గుండెల్లో గూడుకట్టుకుపోయేంత క్రేజ్ తెచ్చుకుంది. రష్మి అంటే మన ఇంట్లో చలాకీగా ఉండే పిల్లే అన్నంత పాపులారిటీ ఆమె తెచ్చుకుంది. అలాంటి రష్మి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తన గుండె బరువెక్కిపోయిందంటే ఆమె తన ఇంట్లో జరిగిన విషాద వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
తన గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా శుక్రవారం కన్నుమూసినట్టు రష్మి తన పోస్ట్‌లో ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రమీలతో తనకు ఉన్న అనుబంధాన్ని సైతం ఆమె తన నోట్‌లో రాసుకువచ్చింది. తన గ్రాండ్ మదర్ ప్రమీల మృతితో తమ కుటుంబంలో ఎంతో విషాదం నెలకొందని.. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆమెకు భారంగా వీడ్కోలు పలికామని చెప్పుకొచ్చింది.
ఆమె ఎంతో స్ట్రాంగ్ ఉమెన్ అని.. తమ కుటుంబంపై ఆమె ప్రభావం ఎంతో ఉందని కూడా రష్మి తెలిపింది. ఆమె జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి.. ఓం శాంతి అంటూ కూడా రాసుకువచ్చింది. రష్మి బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై కూడా అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తోంది. పలు షోలకు యాంకర్‌గా చేస్తూనే వీలున్నప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది.
ఇక బుల్లితెరపై రష్మి ఎంత పాపులరో.. ఆమె చేసిన షోలకు ఎంత టాప్ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్ వస్తుందో చెప్పక్కర్లేదు. ఇక సోషల్ మీడియాలోనూ ఆమె ఫాలోయింగ్‌ను కొట్టేసేవాళ్లే లేరు.