గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలయ్య పేరు ని నెటిజన్స్ ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే . వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా హాజరైన ఈవెంట్లో బాలయ్య టంగ్ స్లిప్ అవుతూ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడారు. ఈ క్రమంలోనే యాంటీ నందమూరి ఫ్యాన్స్ ఆయనను టార్గెట్ చేస్తూ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇదే ఇష్యూ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు అక్కినేని మనవళ్లు నాగచైతన్య – అఖిల్ కూడా ఈ ఇష్యూ పై స్పందించారు .
ఎన్టీఆర్ – ఎస్వీఆర్ – ఏఎన్ఆర్ కళామ తల్లి బిడ్డలు అని ..వాళ్ళని కించపరిచినట్లు మాట్లాడితే మనల్ని మనం కించపరుచుకున్నట్లే అంటూ కౌంటర్ వేశారు . అయితే దీంతో మండిపోయిన నందమూరి ఫ్యాన్స్ అక్కినేని ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు . సరదాగా అన్న మాటలను ఇంత వ్యంగంగా తీసుకోవడం సమంజసం కాదు అంటూ ఫైర్ అయ్యారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలువులు స్టార్ సెలబ్రిటీస్ కూడా బాలయ్య ను తప్పు అంటూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు .
ఈ క్రమంలో ఈ ఇష్యూ పెద్దది కాకముందే స్పందించాడు బాలయ్య . రీసెంట్గా హిందూపురంలో మీడియాతో మాట్లాడుతూ ..అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. “నాగేశ్వరరావు గారు అంటే నాకు ఎంతో గౌరవం ఉంది .ఇండస్ట్రీకి నాన్నగారు – అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు లాంటి వాళ్ళు నే. ను యాదృచ్ఛికంగా అన్న మాటలను ఇలా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు ..ఏఎన్ఆర్ గారిని బాబాయి అని పిలుస్తాను .. తన పిల్లలకంటే ఎక్కువ నాతోనే టైం స్పెండ్ చేశారు . నా వద్ద అన్ని విషయాలు చెప్పుకొచ్చేవారు . కొన్ని ఫ్లోలో అలా అలా మాట్లాడేస్తూ ఉంటాం . దానిపై ఇంత వ్యతిరేకత చూపించి నెగిటివ్గా ప్రచారం చేస్తే నాకేం సంబంధం లేదు . అలాంటి కామెంట్స్ ని నేను పట్టించుకోను ఐ డోంట్ కేర్” అంటూ హుందాగా డేరింగ్ గా రిప్లై ఇచ్చాడు బాలయ్య .
ఈ క్రమంలోనే నాగచైతన్యకు ఘాటుగా కౌంటర్ వేశాడు బాలయ్య అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇకపై అక్కినేని తొక్కినేని విషయంలో బాలయ్యను టార్గెట్ చేస్తే ఊరుకునేదే లేదు అంటూ నందమూరి ఫ్యాన్స్ స్ట్రైట్ గా వార్న్ చేస్తున్నారు..!!