రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి . స్టార్ సెలబ్రిటీస్ మరణించిన విషయాలను మనం ఎక్కువగా వింటున్నాం . ఓ సెలబ్రిటీ మరణించిన విషాద ఛాయలు మరువకముందే మరో సెలబ్రిటీ మరణించారు అంటూ వినిపిస్తున్న న్యూస్లు తీవ్రంగా హార్ట్ చేస్తుంది. కాగా బుల్లితెరపై కూడా ఇలాంటి వార్తలు మనం ఎక్కువగా వింటున్నాం. రీసెంట్గా స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న విష్ణు ప్రియ అమ్మగారు మరణించారు .
విష్ణు ప్రియ అమ్మగారు గురువారం కన్నుమూశారు . దీంతో పలువులు స్టార్ సెలబ్రిటీస్ ఆమె మరణానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు . ఈ క్రమంలోనే విష్ణు ప్రియ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అమ్మకు ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. ” మై డియర్ అమ్మ.. ఈరోజు వరకు నాకు నువ్వు ఎన్నో విషయాల్లో తోడుగా నిలిచావు. నాకు లైఫ్ ను ఎలా ముందుకు తీసుకెళ్లలో చూపించావు.. మీకు ధన్యవాదాలు ..నీకు మాటిస్తున్నాను.. నా చివరి శ్వాస వరకు నీ పేరు నిలబెట్టేందుకే నేను కృషి చేస్తాను”.
”నువ్వే నా బలం నువ్వే నా బలహీనత.. ఈరోజు నువ్వు ఈ లోకంలో లేకపోవచ్చు.. ఎప్పుడూ నాతో నా ప్రతి శ్వాసలో ఉంటావు.. నీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను..షఅంటూ చాలా ఎమోషనల్ గా పోస్ట్ చేసింది”. దీంతో నెటిజన్స్ విష్ణు ప్రియ అమ్మగారికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. విష్ణు ప్రియ ప్రజెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది..!!