Moviesపుష్ప 2 కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్..భయపడుతున్న అల్లు ఫ్యాన్స్..!!

పుష్ప 2 కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్..భయపడుతున్న అల్లు ఫ్యాన్స్..!!

ప్రజెంట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2 . టాలీవుడ్ లెక్కల డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప ది రైస్ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే . అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాలో ఫస్ట్ టైం హీరోయిన్ రష్మిక మందన డి గ్లామరస్ లుక్ లో కనిపించింది.

ఇక ఈ సినిమాల్లో నటించిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా మొత్తానికి కర్త కర్మ క్రియ తానై పోషించి సినిమాకు ఎన్నో అవార్డును తెచ్చిపెట్టాడు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుందని సుకుమార్ సినిమా లాంచింగ్ రోజే చెప్పాడు . రీసెంట్ గా పుస్ప 2 నుండి కొన్ని పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో పుష్ప 2 కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.

పుష్ప2 సినిమా కోసం అల్లు అర్జున్ డేరింగ్ స్ టెప్తీసుకున్నాడు అంటూ తెలుస్తుంది. పుష్ప వన్ తో కంపేర్ చేస్తే పుష్ప 2 లో బన్నీ మరింత మాస్ యాంగిల్ లో కనిపించబోతున్నాడని.. దీని కోసమే ప్రత్యేకంగా డైట్ తీసుకొని తన బాడీని మార్చుకోబోతున్నాడని ..కండలు బయటపడేలా తన బాడీని ఎక్స్పోజ్ చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు దీనికోసం బన్నీ సపరేట్ డైట్ ని ఫాలో అవుతున్నాడట.

ఈ క్రమంలోనే బన్ని దాదాపు 14 కేజీలు పెరగడానికి ఫిక్స్ అయ్యాడట . దీంతో ఒక్కసారి వెయిట్ వస్తే చూడడానికి బాగోదని సినిమా అయిపోయిన తర్వాత మళ్లీ బన్ని ఆ వెయిట్ తగ్గడానికి చాలా కష్టపడాలని చెప్పుకొస్తున్నారు జనాలు. ఈ క్రమంలోని పుష్ప2 సినిమా హిట్ అవ్వడానికి బన్నీ తీసుకున్న నిర్ణయాన్ని కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news