తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న బన్నీ .. టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ కి ఉండే క్రేజ్ రేంజ్ లెవెల్ వేరే . ఇద్దరికీ ఇద్దరే ఏ విషయంలో తగ్గరు . సినిమాల పరంగా ఇద్దరు పాన్ ఇండియా స్టేటస్ అందుకొని హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్నారు . ప్రజెంట్ బన్నీ పుష్ప2 కోసం 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటే ..త్వరలోనే ప్రశాంత్ నీల్- తారక్ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కాగా ఇద్దరు ఒకే జోనర్ కి సంబంధించిన సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్న ఈ స్టార్ హీరోలలో చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ..!!
బన్నీకి అమ్మ అంటే చాలా ప్రాణం.. అమ్మ కోసం ఏమైనా చేస్తాడు. సేమ్ తారక్ కూడా అంతే ఎంత మంది బంధువులు ఉన్న ఎంతమంది ప్రేమించే అభిమానులు ఉన్న అమ్మ తర్వాతే ఎవరైనా అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు . అంతే కాదు బన్నీ మంచి ఫుడీ ఇష్టమైన ఫుడ్ కనిపిస్తే లాగించేస్తాడు.. డైట్ కంట్రోల్ అంటూ పెట్టుకోరు . తారక్ కూడా అంతే ఇష్టమైన బిర్యాని కనిపిస్తే మాత్రం యమ రేంజ్ లో లాగించేస్తాడు . ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు .
అంతేకాదు బన్నీ చాలా కూల్ ఎలాంటి ప్రాబ్లం నైనా కూల్ గా సాల్వ్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు .. తారక్ కూడా అంతే ఎటువంటి ప్రాబ్లంస్ ని అయినా సరే కూల్ గా స్మైల్ తో సాల్వ్ చేయాలనుకుంటాడు ..కానీ తగలదాలతో గొడవలతో ఆ ప్రాబ్లం ని ఇంకా ఎక్కువ చేసుకోడు. ఆ విషయాన్ని ఈ మధ్యకాలంలో మనం ఎన్నో విధాలుగా చూసాం . మరీ ముఖ్యంగా సినిమాలో ఎంత బిజీగా ఉన్నా సరే బన్నీ తన వైఫ్ కి పిల్లలకి టైం కేటాయిస్తాడు. సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ కూడా అంతే ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా తనను ప్రేమించే భార్యకి ..తాను ప్రేమించే పిల్లలకి టైం కేటాయిస్తూ కుటుంబంతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు . ఇలా ఇద్దరు స్టార్ హీరోల మధ్యన చాలా సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి . త్వరలోనే ఇద్దరు సెకండ్ పాన్ ఇండియా సినిమాను రిలీజ్ చేసి హిట్ కొట్టబోతున్నారు. పుష్ప2తో బన్నీ ..ఎన్టీఆర్ 30 సినిమాతో తారక్ మనముందుకు రాబోతున్నారు..!!