మనకు తెలిసిందే టాలీవుడ్ హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . కాగా ఏం మాయ చేసావే సినిమా టైంలోనే వీళ్ల మనసులు కలిసాయి . అయితే కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమ వ్యవహారం నడిపించిన ఈ జంట తర్వాత ఇంట్లోని పెద్దలను ఒప్పించి గ్రాండ్గా గోవాలో పెళ్లి చేసుకున్నారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ జంట ఏడాది క్రితం విడాకులు తీసుకుని దూరం దూరంగా ఉంటున్నారు .
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇద్దరి గురించి లేని పోనీ వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంతకాలం నుంచి అక్కినేని నాగచైతన్య హీరోయిన్ దివ్యాంకా కౌశిక్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు దివ్యాంకా కౌశిక్ అంటూ చాలా మంది చెప్పుకొచ్చారు .
వీళ్ళ మధ్య ఉన్న చనువు చూసి ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఆశపడ్డారు. రీసెంట్ గా ఈ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యాంక కౌశిక్ అక్కినేని ఇంటికి కోడలు పై క్లారిటీ ఇచ్చింది . ఆమె మాట్లాడుతూ..” నాగు నాగచైతన్య అంటే ఇష్టమే..ఐ లవ్ చై..కానీ మేం పెళ్ళి చేసుకోవట్లేదు..జస్ట్ ఫ్రెండ్స్..” అంటూ క్లారిటీ ఇచ్చింది . దీంతో అక్కినేని నాగచైతనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అంటూ చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ..!!