టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి తరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ఆఫర్స్ తో దూసుకుపోయిన పూర్ణ కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళింది . ఆ తర్వాత ఢీ ప్రోగ్రాం ద్వారా తన పేరు మరింత పాపులారిటీ సంపాదించుకున్న పూర్ణ .. పలు క్రేజీ సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
కాగా రీసెంట్ గానే దుబాయ్ కి సంబంధించిన బిజినెస్ మాన్ అసిఫ్ అలీ ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ..త్వరలోనే తల్లి కాబోతుంది. మేము పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది కానీ ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా గ్రాండ్గా వివాహం చేసుకుంది. కొన్ని కారణాల చేత వివాహం చేసుకోవాల్సి వచ్చింది అంటూ చేతులు దులుపేసుకున్న పూర్ణ రీసెంట్గా తల్లి కాబోతున్న విషయాన్ని చాలా సింపుల్ గా ఫినిష్ చేసింది.
పూర్ణ శ్రీమంతం వేడుకలు గ్రాండ్గా జరిగాయి . చూడడానికి చాలా చక్కగా ముద్దుగా ఉన్న పూర్ణ .. బేబీ బంప్ తో చాలా అట్రాక్టీవ్ గా కనిపించింది. అయితే అంగరంగ వైభవంగా జరిగిన పూర్ణ శ్రీమంతానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు హాజరు కాలేదు..అయితే అందుతున్న సమాచారం ప్రకారం పూర్ణ తన శ్రీమంతానికి ఏ సెలబ్రిటీని పిలవలేదు అంటూ తెలుస్తుంది..!!