మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా నుంచి రెండో పాట వచ్చేసింది. ఇది మంచి కలర్ ఫుల్ డ్యూయెట్. చిరంజీవి – శృతిహాసన్ తో డైరెక్టర్ బాబి అదిరిపోయే సాంగ్ ప్రజెంట్ చేయబోతున్నాడు అని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటివరకు వాల్తేరు వీరయ్య టైటిల్ చూసిన వాళ్లంతా చిరు పక్కా మాస్ అవతారమే ఇది అనుకున్న వాళ్లకు ఈ సాంగ్ వచ్చాక ఇందులో క్లాస్ లుక్ కూడా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చేశారు.
వాల్తేరు వీరయ్యలో ముందు నుంచి చిరు లుంగీ కట్టుకున్న స్టిల్స్ హైలెట్ చేస్తూ వచ్చారు. చిరు శ్రీదేవి సాంగ్‌లో మాత్రం ఫుల్ క్లాస్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. హీరోయిన్ శృతినే చిరు పక్కన పర్ఫెక్ట్గా మ్యాచ్ కాలేదా ? అన్నంత సందేహం వచ్చింది. చిరు లుక్ చూస్తే ఓ 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయినట్టుగా ఉంది.
అయితే సాహిత్యం, ట్యూన్ గురించి పక్కన పెట్టేయాల్సిందే.
చిరు లుక్‌తో పాటు కొన్ని స్టెప్పులు, మూమెంట్స్ మాత్రం బాగున్నాయి. ఇవి ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిని బాగా అలరిస్తాయి. అయితే దేవి బాస్ వేర్ ఈజ్ ద పార్టీ కూడా సాహిత్యం, ట్యూన్ పరంగా పెద్ద గొప్పగా లేదన్న విమర్శలు ఇప్పటికే వచ్చేశాయి. ఇప్పుడు శ్రీదేవి – చిరంజీవి సాంగ్‌పై కూడా అదే తరహా విమర్శలు వస్తున్నాయి.
ఈ పాట కూడా కాపీ ట్యూన్ అన్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలోని ‘ సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో..సుందరి’ పాట స్టైల్లో ఉందని.. దేవీ ట్యూన్ కూడా ఆ పాటను అనుకరించే కొంత వరకు ఎత్తేశాడని అంటున్నారు. దేవీ ఇక మారడ్రా బాబోయ్ అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సరే ఈ కాపీ ట్యూన్ సంగతి కాసేపు పక్కన పెడితే పాటలో చిరు లుక్ మాత్రం అదిరిపోయింది.