టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. అక్కినేని హీరో నాగచైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ..ఏం మాయ చేసావే . గౌతమీనన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా అల్లాడించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత ఎంతోమంది ప్రేమ జంటలు ..ఈ సినిమాలోని డైలాగ్స్ వాడుకుంటూ ఇంట్లో వాళ్లని పెళ్లికి ఒప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి . అంతేకాదు ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది యంగ్ స్టార్స్ లవ్ లో పడ్దారు.
అయితే తెలుగులో ఈ సినిమా చేస్తున్న టైంలోనే స్టార్ హీరో నాగచైతన్య- హీరోయిన్ సమంత కూడా ప్రేమలో పడ్డాయి అన్న వార్తలు వినిపించాయి . ప్రమోషన్స్ లో భాగంగా గౌతం మీనన్ మాట్లాడుతూ.. ఏం మాయ చేసావే 2 తెరపైకి రాబోతుందని.. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఏం మాయ చేసావే 2 సెట్స్ పైకి త్వరలోనే వెళ్ళనున్నట్లు సమాచారం అందుతుంది .
అయితే ఈ సినిమాలో హీరోగా నటించేది నాగచైతన్య అయినప్పటికి హీరోయిన్గా నటించేది సమంత కాదని తెలుస్తుంది. ఆ ప్లేస్ లో రష్మిక మందన తీసుకున్నట్లు కోలీవుడ్ మీడియా నుంచి సమాచారం అందుతుంది . అంతేకాదు స్క్రిప్ట్ ప్రకారం సమంతను సమంత-చైతన్య నిజంగానే డివర్స్ తీసుకున్నట్లు ఈ సినిమాలో చూపించబోతున్నారట. తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యలను ఈ స్క్రిప్ట్ లో గౌతమినన్ క్లియర్ గా చూపించబోతున్నట్లు ఒక క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఏం మాయ చేసావే వన్ లో కలిసిన ఈ జంట ఏం మాయ చేసావే 2 లో విడిపోయిన తర్వాత ఎలా ఉంటారో తెలుసుకోవాలని జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.