వచ్చే సంక్రాంతికి సౌత్ సినిమా దగ్గర భారీ బాక్సాఫీస్ క్లాష్ అయితే జరగడానికి రెఢీగా ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టుకుంటున్నాయి. టాలీవుడ్‌లో సీనియర్ హీరోలు బాలయ్య, చిరు సినిమాలు, అటు కోలీవుడ్‌లో స్టార్ హీరోలు అజిత్, విజయ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే విజయ్ వారసుడుకి టాలీవుడ్ టాప్ ప్రొడ్యుసర్ దిల్ రాజు నిర్మాత. పైగా మన తెలుగు వాడు వంశీ పైడిపల్లి డైరెక్టర్. రష్మిక హీరోయిన్.
టాలీవుడ్‌లో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. కోలీవుడ్‌లో విజయ్ వారసుడుతో పాటు అజిత్ తునివు ( తెలుగులో తెగింపు) వస్తున్నాయి. వారసుడు సినిమాను దిల్ రాజు తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇక్కడ వీరసింహా, వీరయ్య, వారసుడు సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. దీంతో థియేటర్ల కేటాయింపు నుంచి అన్ని విషయాల్లోనూ మూడు సినిమాల మధ్య గట్టి కంపేరిజన్లు నడుస్తున్నాయి.
అయితే అనూహ్యంగా అజిత్, విజయ్, బాలయ్య ఈ ముగ్గురు హీరోల సినిమాల విషయంలో ఒక కామన్ పాయింట్ బయటకు వచ్చింది. ఈ మూడు సినిమాల రన్ టైం ఒక్కటే కావడం విశేషం. ఈ మూడు సినిమాలు కూడా 2 గంటల 40 నిమిషాల నిడివితో వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ రన్ టైం విషయంలో సెన్సార్ అయ్యాక ఫుల్ క్లారిటీ రానుంది.
ఇక ఈ మూడు సినిమాలు కూడా జనవరి 12నే వస్తున్నాయి. తునివును తెలుగులో తెగింపు పేరుతో జనవరి 12నే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు తక్కువ థియేటర్లు దొరుకుతున్నాయి. వీరసింహారెడ్డి, వారసుడు రెండూ కూడా జనవరి 12నే పోటాపోటీగా విడుదల కానున్నాయి. ఇక వారసుడు, వీరసింహారెడ్డికి యూఎస్‌లో 11న ప్రీమియర్లు పడుతున్నాయి. అజిత్ సినిమా జనవరి 10 నే ప్రీమియర్స్ తో స్టార్ట్ కానున్నట్టుగా టాక్.