ఎవరికి అయినా టైం బాగుంటే అన్నీ కరెక్టుగానే జరుగుతూ ఉంటాయి. టైం ఏ మాత్రం తేడా కొట్టినా మనం ఎంత కష్టపడినా ఫలితాలు రావు. ఇక ఇప్పుడు నేషనల్ క్రష్మికగా పేరున్న రష్మిక మందన్న విషయంలోనూ అదే జరుగుతుంది. రష్మిక చుట్టూ ఏదో ఒక వివాదం ముసురుకుంటూ ఉంటోంది. కాంతారా సినిమాపై ఆమె చేసిన కామెంట్లు ఆమెకు సొంత ఇండస్ట్రీలో పెద్ద మైనస్ అయ్యాయి. ఒకానొక దశలో కన్నడ సినిమా ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేస్తుందన్న ప్రచారం కూడా జరిగింది.
ఈ ప్రచారం ఎక్కువ కావడంతో పాటు కన్నడ ప్రేక్షకుల్లోనూ రష్మికపై బాగా నెగటివిటి పెరిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న రష్మిక ఓ మెట్టు దిగింది. తాను కాంతారా సినిమా లేట్‌గా చూశానని.. తనపై ఎలాంటి నిషేధం లేదంటూ క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇక తెలుగులో అవకాశాలు రావడం మొదలు పెట్టాక ఆమె కన్నడ సినిమాలను లైట్ తీస్కొంది. బాలీవుడ్‌లో ఆఫర్లు రావడం మొదలు కావడంతో సౌత్ సినిమా, తెలుగు సినిమాలను కూడా లైట్ తీస్కోవడం స్టార్ట్ చేసేసింది.
అంటే ఆమెకు లైఫ్ ఇచ్చిన వాళ్లను ఆమె చాలా సులువుగానే మర్చిపోతుందని ఆమెపై ఉన్న ప్రచారం నిజం అనేలా ఆమె బిహేవియర్ ఉందన్న విమర్శలు వచ్చేశాయి. ఆమెకు తెలుగులో స్టార్టింగ్‌లో మంచి హిట్లు ఇచ్చిన ఇద్దరు హీరోల పేరు ప్రస్తావించేందుకు కూడా ఆమె ఇష్టపడదు అన్న గుసగుసలు ఉన్నాయి. ఇక బాలీవుడ్‌లో ఆమె చేసిన గుడ్ బై సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో బాలీవుడ్‌లో పాతుకుపోవాలని ఆమె కన్న కలలు విఫలమయ్యాయి.
ఇక రెండో సినిమా మిషన్ మజ్ను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. దీంతో రష్మిక ఆశలు అడియాసలు అయ్యాయి. బాలీవుడ్‌లో మూడో ప్రాజెక్టు యానిమల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. బాలీవుడ్ కోసమే ఆమె సౌత్‌లో చాలా మంచి ఆఫర్లు కూడా వదులుకుంది. కట్ చేస్తే అక్కడ ఆమెకు స్టార్టింగ్‌లోనే ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇప్పుడు సౌత్‌లో పూజా, శ్రీలీల దూసుకుపోతున్నారు. ఇప్పుడు సౌత్ అవకాశాలు తగ్గిపోవడంతో రష్మిక పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి చందంగా మారింది.
ఇక ఇప్పుడు ఆమె ఆశలు అన్నీ కూడా విజయ్ వారసుడు సినిమా మీదే ఉన్నాయి. ఆ సినిమా సక్సెస్ అయితే తెలుగు, తమిళంలో ఆమెకు కొన్నాళ్లు తిరుగు ఉండదు. ఈ సినిమా రిజల్ట్ తేడా కొడితే రష్మిక కెరీర్ మరింత డౌన్ అయిపోతుంది. ఇక ఆమె చేతిలో పుష్ప 2 సినిమా ఉన్నా.. ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి మరో యేడాదికి పైగా టైం పడుతుంది.