టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి పోటాపోటీగా వస్తున్నాయి చిరు..బాలయ్య సినిమాల హడావిడి మామూలుగా లేదు. రెండు సినిమాలను నిర్మించే మైత్రీ మూవీస్ వాళ్లు చాలా చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఈ సినిమా నుంచి ఓ వీడియో వదిలితే… అటు ఆ సినిమా నుంచి మరో వీడియో వదులుతున్నారు. ఓవరాల్‌గా రెండు సినిమాల ప్రచారం అయితే మామూలుగా జరగడం లేదు.
ప్రచారం విషయంలో మైత్రీ మూవీస్ వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రచారం పక్కాగా వదలడం వరకే మైత్రీ వాళ్ల బాధ్యత. అయితే డిజిటల్ ప్రమోషన్ విషయం అన్నది వేరే బాధ్యత. ఈ విషయంలో మెగాభిమానులతో పాటు మెగా పీఆర్ టీం చాలా ముందు ఉంటోంది. వాళ్లు పక్కాగా ప్లానింగ్‌తో, మాంచి జోష్‌తో తమ బాస్ వీడియోలు, సాంగ్స్ ముందుకు తీసుకు పోతున్నారు.
ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కంటే మెగాభిమానులే ఒక మెట్టు పైన ఉన్నారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ బేస్ తక్కువని కాదు.. వాళ్ల హంగామాను తక్కువ చేసి చూడడం కాదు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హంగామాతో పోలిస్తే కాస్త వెనకపడినట్టే కనిపిస్తోంది. లేదా మైత్రీ వాళ్లో లేదా బాలయ్య పీఆర్ టీం వాళ్లు ఈ విషయంపై దృష్టి పెట్టాలి.
బాలయ్యకు ఇలాంటి పబ్లిసిటీ వ్యవహారాలు పెద్దగా పట్టవు. కంటెంట్‌ను, కథను, నటననే నమ్ముకుని ముందుకు పోతాడు. పైగా వీరయ్య సినిమాకు రవితేజ ఫ్యాన్స్‌తో పాటు రవితేజ సొంత పీఆర్ టీం కూడా గట్టిగా ప్రమోషన్లు చేస్తోంది. దీనికి తోడు ఇటీవలే మెగా ఫ్యాన్స్ సమావేశమైన బాస్ సినిమాకు ముందే ఎలా ? హైప్ తేవాలి ? ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చేందుకు ఎలా కృషి చేయాలనే దానిపై సమాలోచనలు చేశారు.
అయితే బాలయ్య వీరాభిమానులు థియేటర్ల దగ్గర చేసే రచ్చ మామూలుగా ఉండదు. వాళ్ల దెబ్బతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. వాళ్లు సోషల్ మీడియాలో కూడా ఓ కన్నేసి ఉంచితే రిలీజ్‌కు ముందు ఆ సోషల్ మీడియా హంగామాలోనూ మంచి పోటీ ఉంటుంది.