వీరసింహారెడ్డి రు. 10, వాల్తేరు వీరయ్య రు. 6 ఈ లెక్కేంటి అనుకుంటున్నారా…! వచ్చే సంక్రాంతికి టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలుగా ఉన్న బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు రెండూ రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాల సాంగ్స్, సింగిల్స్ ఒక్కొక్కటి వరుసగా రిలీజ్ అవుతున్నాయి. రెండు సినిమాలకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.
అలాగే రెండు సినిమాలకు అదిరిపోయే రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. రెండు సినిమాలూ మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమయ్యాయి. దీంతో కొన్ని చోట్ల రెండు సినిమాలు ఒకే డిస్ట్రిబ్యూటర్‌కు ఇస్తున్నారు. ఇక నైజాంలో అయితే రెండు సినిమాలను మైత్రీ వాళ్లు స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ స్టార్ట్ చేసి రిలీజ్ చేసుకుంటున్నారు.
అయితే సీడెడ్‌లో పలు చోట్ల రెండు సినిమాలను ఒక్కరికే ఇస్తామంటున్నా బయ్యర్లు వీరసింహారెడ్డిని కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. రెండు సినిమాలు టోకు లెక్కన ఇస్తామంటున్నా… కాస్త ఎక్కువ రేటు అయినా వీరసింహారెడ్డినే కొంటామని.. వీరయ్యను తక్కువ రేట్లకు కొంటామని ఝులక్ ఇస్తున్నారు. సీడెడ్‌లో 100కు పైగా సింగిల్ సెంటర్లలో వాల్తేరు వీరయ్య కంటే .. వీరసింహారెడ్డి సినిమానే తమ థియేటర్లలో ప్రదర్శించేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
పైగా వీరసింంహరెడ్డిని రు. 10 లక్షలకు అడుగుతుంటే… వీరయ్యను రు. 6 లక్షలకు మాత్రమే అడుగుతున్నారు. కావాలంటే మరో రు. 50 వేలు మాత్రమే పెడతామంటున్నారు. దీనిని బట్టి సీడెడ్‌లో బాలయ్య జోరు ఎలా ఉందో అర్థమవుతోంది. ఇక అఖండ ఓవరాల్‌గా 4 కేంద్రాలలో 100 రోజులు ఆడితే.. ఒక్క సీడెడ్‌లోని కర్నూలు జిల్లాలోనే మూడు కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సంగతి తెలిసిందే.