టైటిల్: లాఠీ
నటీనటులు: విశాల్, సునైనా, ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా గోషల్
ఎడిటింగ్ : ఎన్‌బి. శ్రీకాంత్
మ్యూజిక్: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: బాలసుబ్రమణ్యం & బాలకృష్ణ తోట
నిర్మాతలు: రమణ & నందా
దర్శకత్వం : ఎ వినోద్ కుమార్
రిలీజ్ డేట్: 22, డిసెంబర్ 2022
విశాల్ లాఠీ సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎ. వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. విశాల్ ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా బాగానే చేశాడు. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు సైతం తిరుపతి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
మురళీ కృష్ణ (విశాల్) ఒక సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్‌గా తన ఉద్యోగం తాను చేసుకుంటూ ఉంటాడు. ఓ అమ్మాయి మర్డర్ కేసులో మనోడు సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత తన భార్య కవిత ( సునైన) తో పాటు తన కొడుకుతో లైఫ్ గడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మురళీ మళ్లీ జాబ్‌లో జాయిన్ అవుతాడు. అనంతరం భయంకర నేరస్థుడు వీరతో మురళీకృష్ణకు పెద్ద గొడవలు జరుగుతాయి. అసలు వీర ఎవరు ? మురళీకృష్ణను ఎందుకు టార్గెట్ చేశాడు ? వీర కిడ్నాప్ చేసిన తన కొడుకును మురళీ కృష్ణ ఎలా సేవ్ చేసుకున్నాడు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
విశ్లేషణ :
ప్రజలకు, రాజకీయ నాయకులకు సమస్య వస్తే పోలీసుల దగ్గరకే వెళతారు. మరి ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు సమస్య వస్తే, అతడి ఫ్యామిలీలో సమస్యలు వస్తే ? ఆ కానిస్టేబుల్ ఎలా సేవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు జరిగాయన్నదే లాఠీ స్టోరి. ఈ సినిమాలో కొన్ని సీన్లు ఆకట్టుకుంటాయి. విశాల్ తనకు అలవాటైన మాస్ యాక్టింగ్ చంపేశాడు. యాక్షన్ సీన్లలో విశాల్ నటన సినిమాకే హైలెట్.
ఇక ప్రధాన పాత్రలో నటించిన ప్రభు, హీరోయిన్ సునైనా ఎమోషనల్ యాక్టింగ్, హీరో – విలన్ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. మిగిలిన నటీనటుల స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. అయితే హై యాక్షన్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఎ వినోద్ కుమార్ దర్శకత్వం బాగున్నా.. స్క్రిఫ్ట్‌లో మాత్రం విషయం లేదు.
అసలు సినిమాలో మెయిన్ పాయింట్ బాగున్నా.. మెయిన్ సీక్వెన్స్ మాత్రం ఇంట్రస్టింగ్‌గా లేవు. ఫస్టాఫ్‌లోనే ఏ మాత్రం ఆసక్తిగా లేని సీన్లతో సినిమా బోర్ కొడుతుంది. ఏ మాత్రం వర్కవుట్ కానీ పోలీస్ డ్రామాతో ప్రేక్షకులను డిజప్పాయిట్మెంట్ చేస్తుంది. సెకండాఫ్‌లో సాగదీత సన్నివేశాలు ఉంటాయి. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే సినిమా స్థాయి వీక్ అని తెలిసిపోతుంది.
ఓ సాధారణ కానిస్టేబుల్‌కు ఎన్ని సమస్యలు ఉంటాయి ? అతడి జాబ్‌లో ఎన్ని రిస్క్‌లు ఉంటాయి ? అతడి ఫ్యామిలీ ఇబ్బందులు, జాబ్ రిస్క్ చాలా బాగా చూపించారు. అనవసర సీన్లతో సినిమాను డైవర్ట్ చేసేశారు. కథలో వేస్ట్ సీన్లు చాలా ఎక్కువుగా ఉండి చూసేవాళ్లకు నీరసం వస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో హై యాక్షన్ సీన్లు ఎమోషనల్‌గా ఉన్నా అవి సినిమాటిక్‌గా ఉంటాయి. ఏదేమైనా విశాల్ నుంచి వచ్చిన మరో రొటీన్ బోరింగ్ డ్రామాయే ఈ సినిమా.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్‌గా లాఠీ సినిమాటోగ్రఫీ బాగుంది. కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీన్లు మాత్రం సినిమా స్టోరీకి అనుగుణంగా ఉన్నాయి. ఎడిటింగ్ బాగున్నా… దర్శకుడే బోరింగ్ సీన్లు ఇవ్వడంతో ఎడిటర్‌ను తప్పు పట్టలేం. యువన్ శంకర్‌రాజా మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా…
యాక్షన్ సీన్లు పక్కన పెడితే ఆకట్టుకునే కథ, కథనాలు లేకపోవడం, లాజిక్స్ కూడా లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర విశాల్ లాఠీ ఝులిపించలేకపోయాడు.
లాఠీ రేటింగ్: 2 / 5