సౌత్ సినిమా ఇండస్ట్రీలో సిల్క్ స్మిత ఓ సంచలనం, ఓ ప్రభంజనం. కష్టాల కడలిలో నుంచి వచ్చి కడుపు నింపుకోవడం కోసం నచ్చని పని చేస్తూ దానినే పూర్తి స్థాయిలో తన జీవనాధారంగా మలచుకొని ఓ స్టార్ హీరోయిన్‌కి ఉన్న ఇమేజ్‌ను సొంతం చేస్తుంది. ఐటెం సాంగ్స్ అంటే జ్యోతిలక్ష్మీ, జయమాలిని అని మాత్రమే చెప్పుకుంటున్న రోజుల తర్వాత సిల్క్ స్మిత సృష్ఠించిన అలజడి అంత ఇంతా కాదు.
విజయలక్ష్మీ తన అసలు పేరు అయినప్పటికీ తను చేసే వ్యాప్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్‌కి సిల్క్ స్మిత అయితేనే కరెక్ట్ అని మేకర్స్ మార్చారు. సాధారణంగా అంత మంచి పేరు వదులుకోవడం ఇలాంటి పాత్రలకోసం అంటే ఇంకొకరైతే ససేమిరా అనేవారు. కానీ, సిల్క్ స్మితకి ఉన్న అప్పటి పరిస్థితులు వేరు. కుటుంబ పోషణ కోసం ఒంటిమీద బట్టలు సైజు తగ్గించుకోక తప్పలేదు.
సిల్క్ స్మిత కళ్ళకి ఉన్న పవర్, మత్తు ఇంకెవరికీ లేదంటే నమ్మి తీరాల్సిందే. ఇంత అద్భుతమైన నటి అకాల మృతి తర్వాత వచ్చిన వదంతులు ఎన్నో రకాలు. వాటి ఆధారంగా మన సౌత్‌లో తెరక్కాల్సిన సిల్క్ స్మిత బయోపిక్ బాలీవుడ్‌లో రూపొందింది. ఇందులో స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ సిల్క్ పాత్రలో నటించి మెప్పించింది. నిజంగా తన లైఫ్ ఇదేనా..? అనే సందేహాలు చాలామందిలో కలిగాయి.
ముఖ్యంగా దర్శకనిర్మాతలు, తోటి నటులు సిల్క్‌ని ఎలా వాడుకున్నారో చూసిన వారెవరూ మన మధ్య లేరు గానీ, డర్టీ పిక్చర్ అంటూ హిందీలో వచ్చిన సిల్క్ స్మిత బయోపిక్‌లో మాత్రం విద్యాబాలన్‌ను ఎంత ఘాటుగా చూపించాలో అంత ఘాటుగా చూపించారు. డబుల్ మీనింగ్ డైలాగులతో నాకేశారు. స్క్రీన్ నటించిన నషీరుద్దిన్ షా ఆన్‌స్క్రీన్ పర్ఫార్మెన్స్‌లో రొమాన్స్ బాగా చేశాడు. ఈ సినిమా కేవలం సిల్క్ స్మితను తలుచుకొని విద్యాబాలన్ కోసం వెళ్ళిన వారే ఎక్కువ.