Movies' వీర‌సింహారెడ్డి ' పై అదిరిపోయే రివ్యూ వ‌చ్చేసింది... బాల‌య్య పూన‌కాలు......

‘ వీర‌సింహారెడ్డి ‘ పై అదిరిపోయే రివ్యూ వ‌చ్చేసింది… బాల‌య్య పూన‌కాలు… సినిమా బ్లాక్‌బ‌స్ట‌రే..!

బాల‌య్య వీర‌సింహారెడ్డి సంక్రాంతి బ‌రిలోకి దిగుతోంది. ఎన్ని సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నా బాల‌య్య సినిమా ఉంటే ఆ మ‌జా ఎలా ? ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఓ వైపు కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ తెగింపు, విజ‌య్ వార‌సుడుతో పాటు ఇటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య కూడా పోటీకి దిగుతున్నాయి. ఇక ఈ సినిమాల‌తో పాటు సంతోష్ శోభ‌న్ సినిమా, జీవితా రాజ‌శేఖ‌ర్ కుమార్తె సినిమాలు కూడా సంక్రాంతికే అంటున్నారు.

పోటీ ఎక్కువ ఉండడం, మూడు పెద్ద సినిమాలు కావ‌డంతో సోలో రిలీజ్ ఏ సినిమాకు లేదు. థియేట‌ర్లు కూడా త‌క్కువ‌గానే దొర‌క‌నున్నాయి. ఇక పోటీలో ఎంద‌రు హీరోలు ఉన్నా మెయిన్ వార్ బాల‌య్య వ‌ర్సెస్ చిరంజీవి సినిమాల మ‌ధ్యే జ‌ర‌గ‌నుంది. అయితే వీర‌సింహారెడ్డి సినిమాలో విల‌న్‌గా న‌టించిన అజ‌య్‌ఘోష్ మాత్రం ఈ సినిమా సంక్రాంతికి ప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ అని చెపుతున్నాడు. ఈ సినిమాకు ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చింది అజ‌య్ ఘోష్‌నే.

అజ‌య్‌ఘోష్ ఇప్పుడు టాలీవుడ్‌లో విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో పాపుల‌ర్ అవుతున్నాడు. మ‌నోడు తెలుగు వ్య‌క్తి కావ‌డం విశేషం. రంగ‌స్థ‌లం సినిమాలో అజ‌య్‌ఘోష్ విల‌నిజానికి మంచి మార్కులు ప‌డ్డాయి. 2010లో రిలీజ్ అయిన ప్ర‌స్థానం సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన అజ‌య్ అక్క‌డ నుంచి వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. అజ‌య్ ఏపీలోని ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన వ్య‌క్తి.

రంగ‌స్థ‌ల క‌ళాకారుడిగా పాపుల‌ర్ అవ్వ‌డంతో పాటు ఇప్పుడు వెండితెర మీద‌కు వ‌చ్చి దూసుకు పోతున్నాడు. ఇక వీర‌సింహారెడ్డి సినిమాలో తాను ఎంపీ పాత్ర‌లో న‌టించాన‌ని.. మెయిన్ విల‌న్ దునియా విజ‌య్‌కు మేన‌మామ‌గా కన్నింగ్ విల‌న్‌గా క‌నిపిస్తాన‌ని.. త‌న పాత్ర‌ను ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ తీర్చిదిద్దిన తీరు అద్భుతం అని చెప్పాడు.

ఇక సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న వీర‌సింహారెడ్డి థియేట‌ర్ల‌లో తాండ‌వం ఆడించేస్తుంద‌ని… బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించేశాడ‌ని.. ఖ‌చ్చితంగా ఈ సంక్రాంతి వీర‌సింహారెడ్డిదే అని చెప్పేశాడు. ఏదేమైనా అజ‌య్‌ఘోష్ వీర‌సింహారెడ్డికి ఫ‌స్ట్ రివ్యూ బ్లాక్‌బ‌స్ట‌ర్ అని ఇవ్వ‌డంతో నంద‌మూరి అభిమానుల ఆనందం అయితే స్కై రేంజ్‌లోనే ఉంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news