Moviesవార‌సుడు Vs వీర‌సింహా Vs వీర‌య్య... బాల‌య్య కంటే చిరు సినిమాకే...

వార‌సుడు Vs వీర‌సింహా Vs వీర‌య్య… బాల‌య్య కంటే చిరు సినిమాకే ఎక్కువ మైన‌స్‌లు…!

టాలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జ‌న‌వ‌రి 12నే బాల‌య్య వీర‌సింహారెడ్డి, విజ‌య్ బైలింగ్వుల్ మూవీ వార‌సుడు రావ‌డం క‌న్‌ఫార్మ్‌. ఇక 13న చిరు వాల్తేరు వీర‌య్య దిగుతుంది. మూడూ పెద్ద సినిమాలే.. మూడు సినిమాల‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. వార‌సుడు హీరో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ అయినా.. ఆ సినిమా నిర్మాత టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు కావ‌డంతో పాటు ఏపీ, తెలంగాణ‌లో మంచి థియేట‌ర్లు అన్నీ వార‌సుడికి బుక్ అయిపోవ‌డంతో వార‌సుడిని కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. పైగా వార‌సుడు డైరెక్ట‌ర్ మ‌న టాలీవుడ్‌కే చెందిన వంశీ పైడిప‌ల్లి. ఇక ఈ మూడు సినిమాల‌కు సంబంధించిన ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఏంటి ? ఏ సినిమాకు ప్రి రిలీజ్ బ‌జ్ ఉందో చూద్దాం.

వీర‌సింహారెడ్డి :
అఖండ లాంటి కెరీర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న సినిమా వీర‌సింహారెడ్డి. బాల‌య్య ఇప్పుడు కెరీర్‌లోనే ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఏజ్ పెరుగుతోన్న కొద్ది బాల‌య్య‌కు ఇంత క్రేజ్ వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. అటు వెండితెర‌తో పాటు ఇటు బుల్లితెర‌ను కూడా బాల‌య్య షేక్ చేసి ప‌డేస్తున్నాడు. బాల‌య్య‌కు ఇప్పుడు అంతా గోల్డెన్ టైం న‌డుస్తోంది. పైగా శృతీహాస‌న్ లాంటి హీరోయిన్‌. ఇప్ప‌టికే రిలీజ్ అయిన జై బాల‌య్య సాంగ్ మాంచి ఊపు ఇచ్చింది. క్రాక్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. అఖండ‌కు థియ‌ట‌ర్ల‌లోనే పూన‌కాలు తెప్పించేసిన థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. పైగా మైత్రీ మూవీస్ లాంటి పెద్ద బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న సినిమా. ఇక బాల‌య్య యాక్ష‌న్ చింపేశాడంటున్నారు.. డైలాగులు ఇవ‌న్నీ ఈ సినిమాకు ప్ల‌స్‌లు.

బాల‌య్య సినిమాకు కొన్ని మైన‌స్‌లు కూడా ఉన్నాయి. ఈ సినిమా స్టోరీ రొటీన్ లైనే అంటున్నారు. ష‌రా మామూలుగానే బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేస్తున్నాడు. అఖండ‌కు త‌క్కువ ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఎక్కువ లాభాలు వ‌చ్చాయి. వీర‌సింహారెడ్డి సినిమాకు బ‌డ్జెట్ కాస్త ఓవ‌ర్ అయ్యిందంటున్నారు. దీంతో బాల‌య్య కెరీర్‌లోనే ఎక్కువ రేట్ల‌కు అమ్ముతున్నారు. దీనికి తోడు అదే రోజు విజ‌య్ వార‌సుడు ఉండ‌డతో అఖండ‌లా సోలో రిలీజ్ అయితే ఇప్పుడు బాల‌య్య‌కు లేదు. మ‌రుస‌టి రోజే చిరు వీర‌య్య కూడా ఉంది. దీంతో లిమిటెడ్ థియేట‌ర్ల‌తోనే బాల‌య్య ఆ రెండు సినిమాల‌తో పోటీ ప‌డాల్సి ఉంటుంది.

వాల్తేరు వీర‌య్య‌:
చిరంజీవి చాలా రోజుల త‌ర్వాత ముఠామేస్త్రి లాంటి ఊర‌మాస్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ఈ సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్‌. శృతీహాస‌న్ హీరోయిన్‌.. మైత్రీ మూవీస్ బ్యాక‌ప్‌.. ఈ యేడాదిలో మూడోసారి చిరు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం… మూడు, నాలుగు సినిమాల మ‌ధ్య 2017 సంక్రాంతికి రిలీజ్ అయ్యి.. రీ మేక్ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో కూడా భారీ వ‌సూళ్లు సాధించ‌డం.. హ‌య్య‌స్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ ఇవ‌న్నీ వీర‌య్య‌కు ఉన్న ప్ల‌స్‌లు.

ఎంత పెద్ద హీరో అయినా కూడా బాల‌య్య సినిమాతో పోలిస్తే చిరు సినిమాకే ఎక్కువ మైన‌స్‌లు ఉన్నాయి. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ 150ను మిన‌హాయిస్తే చిరు సినిమాలు అన్నీ డిజ‌ప్పాయింట్మెంట్ చేస్తూ వ‌స్తున్నాయి. సైరా క‌మ‌ర్షియ‌ల్ ప్లాప్‌. ఆచార్య‌ను డిజాస్ట‌ర్‌కు మించిన అమ్మ మొగుడు అనాలి. ఆ సినిమాతో చిరు ప‌రువు పోయింది. గాడ్ ఫాద‌ర్ హిట్ అన్నా క‌మ‌ర్షియ‌ల్‌గా భారీ న‌ష్టాలు తెచ్చిపెట్టింది. అస‌లు చిరు సినిమాలు అంటే ప్రేక్ష‌కుల్లో ఉండాల్సిన క్యూరియాసిటీ ఉండ‌డం లేదు. దేవి మ్యూజిక్‌పై హైప్ లేదు. అన్నింటికి మించి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌లో చీలిక‌, అల్లు అభిమానులు స‌ప‌రేట్‌గా ఉండ‌డం… సంక్రాంతికి మూడు సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్‌.. థియేట‌ర్ల‌ను పంచుకోవాల్సి రావ‌డం.. ఈ సినిమా డైరెక్ట‌ర్ బాబి ఎంత కొత్త క‌థ‌ను అయినా చాలా రొటీన్‌గా తీస్తాడ‌న్న పేరు ఇవ‌న్నీ బిగ్గెస్ట్ మైన‌స్‌లుగా క‌నిపిస్తున్నాయి. చిరు ఇమేజ్ ఒక్క‌టే వీటిని క‌వ‌ర్ చేయాల్సి ఉంది.

వార‌సుడు :
విజ‌య్ సౌత్ ఇండియాలో క్రేజీ హీరో. తొలిసారిగా తెలుగులో స్ట్రైట్‌గా చేస్తోన్న సినిమా వార‌సుడు. ఇక్క‌డ టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మాత కావ‌డం.. మ‌న తెలుగు స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు కావ‌డం.. సౌత్‌ను ఊపేస్తోన్న ర‌ష్మ‌క మంద‌న్న హీరోయిన్ ఇవ‌న్నీ ఈ సినిమా ప్ల‌స్‌లు. ఇక దిల్ రాజు ఏపీ, తెలంగాణ‌లో టాప్ మోస్ట్ థియేట‌ర్ల‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఎంత దిల్ రాజు నిర్మాత‌, వంశీ పైడిప‌ల్లి డైరెక్ట‌ర్ అయినా విజ‌య్‌కు తెలుగులో ముందు నుంచి మిగిలిన త‌మిళ హీరోలంత క్రేజ్ లేదు. పైగా ఇద్ద‌రు పెద్ద హీరోల మ‌ధ్య‌లో పోటీ అంటే సినిమా ఎంతో పెద్ద హిట్ అయితే త‌ప్పా ఇక్క‌డ వాళ్లు అనుకున్నంత బ‌జ్ అయితే లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news