Moviesవార‌సుడు ప్లాప్... వీర‌సింహారెడ్డి హిట్‌ అని చిరంజీవి ఇన్‌డైరెక్టుగా చెప్పేశారా... !

వార‌సుడు ప్లాప్… వీర‌సింహారెడ్డి హిట్‌ అని చిరంజీవి ఇన్‌డైరెక్టుగా చెప్పేశారా… !

ఒకే పండక్కు తమ సినిమాలతో పోటీపడే విషయంలో హీరోల ఫీలింగ్స్ ఎలా ? ఉంటాయో కానీ ఆ హీరోల ఫ్యాన్స్ మాత్రం తమ హీరోల సినిమాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. అది టాలీవుడ్ లో ఇప్పటినుంచే కాదు.. ఎన్టీఆర్ – కృష్ణ, ఎన్టీఆర్ – ఏఎన్నార్ సినిమాలు పోటీపడినప్పటి నుంచి జరుగుతూ వస్తోంది. అందుకే ఒకేసారి రెండు పెద్ద హీరోలు సినిమాలు సంక్రాంతికి వస్తే థియేటర్ల‌ పంపకాలతో మొదలుపెట్టి తొలిరోజు ఓపెనింగ్, క్లోజింగ్ షేర్లు, ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇలా ప్రతీ విషయంలోనూ అభిమానుల హంగామా మామూలుగా ఉండదు.

ఇక టాలీవుడ్ లో మూడున్న‌ర‌ దశాబ్దాలుగా చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ఎప్పుడు పోటీపడిన ఆ రేసు రసవత్తరంగా ఉంటుంది. అలాంటిది సంక్రాంతికి వీరిద్దరూ పోటీ పడితే ఆ మజాయే వేరు. ఇక వచ్చే సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలు పోటీపడుతున్నాయి. పైగా ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్. రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ నుంచి వస్తున్నాయి.

ఈ రెండు సినిమాల‌కు మధ్యలో మరో అగ్ర నిర్మాత, టాప్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వారసుడు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. వారసుడు హీరో విజ‌య్ త‌మిళ్‌ అయినా ఆ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావటం.. తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకుడు కావటం, రష్మిక హీరోయిన్ కావడంతో వారసుడు కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. 2017 సంక్రాంతి త‌ర్వాత ఈ ఇద్ద‌రు మ‌రోసారి త‌మ సినిమాల‌తో పోటీ ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే చిరు 25 ఏళ్ల క్రితం ఏదైతే జ‌రిగిందో ఇప్పుడూ అదే జ‌రుగుతుంద‌ని చెప్పారు. అంటే చిరు ఉద్దేశంలో 1997 సంక్రాంతి స్పెష‌ల్ అంటున్నారు. ఆ సంక్రాంతికి చిరు హిట్ల‌ర్‌, బాల‌య్య పెద్ద‌న్న‌య్య రెండూ హిట్ అయ్యాయి. అదే సంక్రాంతికి మూడో సినిమా వెంక‌టేష్ చిన్న‌బ్బాయ్ డిజాస్ట‌ర్ అయ్యింది. అంటే నాడు త‌న‌తో పాటు బాల‌య్య సినిమా హిట్ అయ్యి.. మూడో సినిమా ప్లాప్ అయ్యింది.

ఇప్పుడు కూడా త‌న వీర‌య్య‌, బాల‌య్య వీర‌సింహా హిట్ అవుతాయ‌ని.. మూడో సినిమాకు చోటు ఉండ‌ద‌ని బాల‌య్య ప‌రోక్షంగా చెప్పార‌న్న చ‌ర్చ‌లు కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. 25 ఏళ్ల సీన్ రిపీట్ అవుతుంద‌న్న చిరు త‌న‌, బాల‌య్య సినిమాలు ఖ‌చ్చితంగా స‌క్సెస్ అవుతాయ‌ని.. మూడో సినిమాకు స్కోప్ ఉండ‌ద‌నే అన్నార‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది.

ఇక థియేట‌ర్ల గొడ‌వ గురించి కూడా చిరు స్పందించారు. అది నిర్మాతల వ్యవహారమని… రెండూ వాళ్ళ బిడ్డలే అయినందున ఒక క‌న్ను పొడుచుకునేందుకు ఇష్ట‌ప‌డ‌ర‌ని చెప్పేశారు. ఏదేమైనా దిల్ రాజు చిరు, బాల‌య్య సినిమాల కంటే వార‌సుడికే ఎక్కువ థియేట‌ర్లు వేసుకుంటున్నాడ‌న్న చ‌ర్చ‌ల నేప‌థ్యంలో చిరు చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో డిస్క‌ర్ష‌న్‌కు కార‌ణ‌మ‌య్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news