Moviesతండ్రి కాబోతున్న చరణ్..అఫిషీయల్ గా ప్రకటించిన చిరంజీవి..ఆ స్పెషల్ డే నాడే...

తండ్రి కాబోతున్న చరణ్..అఫిషీయల్ గా ప్రకటించిన చిరంజీవి..ఆ స్పెషల్ డే నాడే ఉపాసన డెలివరీ..!

ఎస్ ఇది నిజంగా మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి . గత పది సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు ఇలాంటి గుడ్ న్యూస్ చెప్తారా అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన మెగా అభిమానులకు దతీపి కబురు అందించారు మెగాస్టార్ చిరంజీవి . మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్ చరణ్ ప్రజెంట్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకుని బిగ్ సినిమాల్లో నటిస్తున్నాడు . ఇక ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన కూడా ఇండస్ట్రీలో మంచి పేరుతో దూసుకుపోతుంది .

కాగా అన్ని బాగున్నా ఈ జంటకు పిల్లలు లేరన్న ఒక బాధ మెగా అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది . అయితే అలాంటి అభిమానులను ఉత్సాహపరుస్తూ చిరంజీవి మెగా వారసుడు రాబోతున్నాడు అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు . ఎస్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవచ్చాడు . ఆ హనుమాన్ దయవల్ల రామ్ చరణ్ ఉపాసన తమ మొదటి బిడ్డను ఆహ్వానించబోతున్నారు అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు మెగాస్టార్ చిరంజీవి .

కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . ఇన్నాళ్లు ఉపాసన – చరణ్ కు పిల్లలు లేరు అంటూ మీమ్స్ తో ట్రోల్ చేసిన వాళ్లే ఇప్పుడు వాళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఉపాసనకు ఇప్పుడు మూడో నెల. అంతే కాదు అన్ని కుదిరితే వాళ్ళ జీవితంలో పెళ్లి బంధం ముడిపడిన నాడే స్పెషల్ డే జూన్ 14న బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మెగా కాంపౌండ్ నుంచి ఓ న్యుస్ లీక్ అవుతుంది.

ఏది ఏమైనా సరే పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట గుడ్ న్యూస్ చెప్పడంతో సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీస్ బిగ్ స్టార్స్ అందరూ వాళ్ళకి కంగ్రాట్యులేషన్స్ చెప్తున్నారు. ఇక అప్పుడే మెగా ఫ్యాన్స్ పుట్టబోయేది ఆడపిల్లనా..? మగబాబు నా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కచ్చితంగా రాంచరణ్ కి కొడుకే పుడతాడు అని కొందరు అంటుంటే లేదు మెగాస్టార్ కి ఆడపిల్లలంటే ఇష్టమని పాప పడుతుందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి చరణ్ కు పాప పడుతుందో..? బాబు పుడతాడో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news