ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఎందుకో తన ఫాత ఫామ్‌ను అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్న వాతావరణమే ఉంది. అటు దేవికి పోటీగా ఉన్న థమన్‌పై కూడా అప్పుడప్పుడు కాపీ మరకలు పడుతున్నాయి. అయితే థమన్ మధ్యలో కొన్ని సినిమాలకు అయినా తన విశ్వరూపం చూపించి మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. అల వైకుంఠపురంలో, అఖండ సినిమాలకు థమన్ మ్యూజిక్ ఆ సినిమాల విజయంలో సగం హెల్ఫ్ అయ్యింది.
ఇక్కడ దేవీకి ఆ స్థాయి పేరు ఇటీవల కాలంలో ఏ సినిమాతోనూ రాలేదు. పుష్ప మ్యూజిక్ బాగున్నా థమన్‌కు పై రెండు సినిమాలు తెచ్చినంత పేరు అయితే పుష్ప దేవీకి తేలేదు. ఇక ఇప్పుడు దేవీ చేతిలో ఉన్న పెద్ద సినిమా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య. ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ వేర్ ఈజ్ ద పార్టీ ఫస్ట్ సింగిల్ సినిమాపై పెద్ద హైప్ అయితే తేలేదు. పైగా దేవి ఇచ్చిన సాహిత్యం కూడా చాలా ముతకగా ఉంది.
కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవి అంట.. రాయే రాయే రాయే అన్న సాంగ్ ఫస్ట్ లైన్ లీక్ చేశాడు. ఈ పాట లిరిక్స్ కొంత వరకు బాగున్నా దేవీ పాట పాడిన స్టైల్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక రాయే రాయే రాయే అన్న ట్యూన్ కూడా పాత సినిమా పాటల వాసనను గుర్తుకు తెచ్చేలా ఉంందనే ఎక్కువ మంది అంటున్నారు. ఇప్పటికే బాస్ వేర్ ఈజ్ ద పార్టీ దేవీయే రాసుకుని దేవీయే పాడుకుని.. దేవీయే ట్యూన్ ఇచ్చి.. చివరకు దేవీ మాత్రమే వినేలా ఉందన్న విమర్శలు వచ్చాయి.
ఇక ఇప్పుడు ఈ సాంగ్ స్టార్టింగ్ లిరిక్ కాని.. ఆసక్తిగా లేవు. ఈ సాంగ్‌పై కూడా ట్రోలింగ్ తప్పదనే చర్చలు నెట్టింట్లో అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. ఇక సాంగ్స్ విషయంలోనే ముందుగానే నెగటవిటి స్టార్ట్ అయితే.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక బీజీఎం విషయంలో ఎలా ఉంటుంది ? దేవి ఏదైనా మ్యాజిక్ చేస్తాడా ? మళ్లీ పాత బీజీఎం ఎత్తేస్తాడా ? అన్నది చూడాలి.