తమిళ తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న హీరోయిన్ త్రిష. ఈ బ్యూటీ ఏజ్ పెరుగుతున్నా అందం మాత్రం తరగటం లేదు. కుర్ర హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ ఈ ముద్దుగుమ్మ ఎవరితో అయినా రొమాన్స్ కు సై అంటోంది. త్రిష టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు సినిమాలు ఈ బ్యూటీకి మంచి ఫాలోయిగ్ ను సంపాదించి పెట్టాయి. ఇక తమిళ్ లో జాను సినిమాతో త్రిష బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
త్రిష తెలుగులోనూ చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. పవన్, మహేష్, ఎన్టీఆర్ పక్కన కూడా నటించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా 15 ఏళ్లకు పైగా త్రిష ఏలేసిందనే చెప్పాలి. ఇన్నేళ్ల కెరీర్లో త్రిష పర్ఫామెన్స్ చూసి సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే హీరోయిన్ లకు హీరోలతో లవ్ ఎఫైర్ లు ఉండటం చాలా కామన్. అయితే కొందరివి బయటపడితే మరికొందరి మాత్రం అన్నీ సీక్రెట్ గా జరిగిపోతాయి.
త్రిషతో కోలీవుడ్ హీరో శింబు లవ్ ఎఫైర్ నడిపించాడు. ఆ విషయం చాలా మందికి తెలుసు. అంతే కాకుండా ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మతో టాలీవుడ్ హీరో రానా కూడా ప్రేమాయణం నడిపించాడని వార్తలు వచ్చాయి. వీరిద్దరి పర్సనల్ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. వీరిద్దరు కలిసి హైదరాబాద్లోని ఓ పబ్ నుంచి తూలుతూ బయటకు వస్తోన్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ విషయం పై త్రిష ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్ లు చేసింది. తనకు రానాతో చిన్ననాటి నుంచి పరిచయం ఉందని చెప్పింది. రానా ముందు చెన్నై లో చదువుకున్నాడని రానా వాళ్ల ఇంటి దగ్గరగానే తమ ఇల్లు కూడా ఉండేదని చెప్పింది. ఇద్దరి మధ్య ఇప్పటికీ కూడా హేట్ అండ్ లవ్ రిలేషన్ లో ఉన్నామంటూ బాంబు పేల్చింది. అంతే కాకుండా రానా చుట్టూ ఎప్పుడూ అమ్మాయిలే ఉంటారని బాంబు పేల్చి రానా పరువు తీసినంత పని చేసింది.
వర్షం సినిమా సమయం నుంచి తనకు ఫ్రెండ్ అయ్యాడని చెప్పింది. అంతే కాకుండా రానాకు ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా పెద్ద సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినట్టు బిహేవ్ చేయడని… అందరితో కలిసి పోతాడని కితాబిచ్చింది. ఇక రానా మాజీ ప్రియురాలు చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.