ఆమె నార్త్ ఇండియన్ అమ్మాయి.. చూడడానికి బక్క పల్చగా ఉంటుంది. టాలీవుడ్లోకి ఏడెనిమిదేళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న హీరోల పక్కన ఛాన్సులు రావడమే ఎక్కువ. ఫస్ట్ రెండు, మూడు సినిమాలు పెద్దగా క్లిక్ కాలేదు. ఆ తర్వాత వరుసగా హిట్లు. స్టార్ హీరోల పక్కన ఛాన్సులు. అసలు మూడేళ్లు అయితే ఆమె డైరీ ఖాళీ లేనంత బిజీగా స్టార్ హీరోల పక్కన పెద్ద సినిమాల్లో నటించింది. మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఇలా అందరి పక్కన నటించేసింది.
ఆ తర్వాత తెలుగులో మంచి అవకాశాలు కాదనుకుని బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ ఓ స్టార్ హీరోను పట్టేసింది. ఆ స్టార్ హీరో ఆమెకు వరుసగా అవకాశాలు ఇస్తూ ఆదుకుంటున్నాడు. తెలుగులో ఫేడవుట్ అయిపోయింది. సినిమాలు లేకపోయినా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులను బుట్టలో వేసుకుంది. తన అందాన్నే పెట్టుబడిగా పెట్టుకుని వ్యాపారంగా మార్చేసుకుంది.
ఓ కీలక నేత అండదండలతో హైదరాబాద్‌లో తన వ్యాపారాలను బాగా విస్తరించుకుంది. తన ఫ్యామిలీ మెంబర్స్‌నే హైదరాబాద్‌కు షిఫ్ట్ చేయించి భారీ ఎత్తున రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేసింది. రియల్ ఎస్టేట్‌లోనూ ఆమె పెట్టుబడులు బాగానే ఉన్నాయి. చెన్నై, బెంగళూరులోనూ విలాసవంతమైన విల్లాలు కొనుక్కుంది. ఆమె సినిమాల నుంచి ఫేడవుట్ అయిపోయి నాలుగేళ్లు అవుతోంది.
బాలీవుడ్లో ఓ స్టార్ హీరోను పట్టి అతడితో వరుసగా సినిమాలు చేస్తోంది. టాలీవుడ్లో సినిమా ఛాన్సులు లేకపోవడంతో రాజకీయ నాయకులకు తన రుచులు చూపించేస్తోంది. పొలిటికల్ పైసలు ఎప్పుడు అయితే వచ్చి పడుతున్నాయో ఆమె కోట్లతోనే వ్యాపారాలు విస్తరించుకుంటూ పోతోంది. అయితే ఆమె కథ ఇక్కడితో ఆగిపోలేదు.. డ్రగ్స్ సామ్రాజ్యంలో కూడా లింకులు ఉన్నాయన్న గుసగుసలు ఉన్నాయి.
డ్రగ్స్ వరకు వెళితే ఈడీ వాళ్లు ఊరుకోరు కదా ? అందుకే ఆ దిశగా కూడా ఆమెపై కన్నేసినట్టు తెలుస్తోంది. రేపటి వేళ ఆమె భవిష్యత్తు ఏమవుతుందో ? ఆమెకే తెలియాలి. ఎంత హీరోయిన్ అయినా ఎంత ఎంజాయ్మెంట్, డబ్బు సంపాదన ఉన్నా లిమిట్ దాటనంత వరకే ఉండాలి. మరీ విచ్చలవిడిగా వెళ్లిపోతే ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఇలాంటి పరిస్థితుల్లో బుక్ అవ్వాల్సిందే..!