Moviesదిల్ రాజుపై యాక్ష‌న్‌కు రెడీ అవుతోన్న టాలీవుడ్‌... స్కెచ్ గీస్తోంది ఎవ‌రంటే..!

దిల్ రాజుపై యాక్ష‌న్‌కు రెడీ అవుతోన్న టాలీవుడ్‌… స్కెచ్ గీస్తోంది ఎవ‌రంటే..!

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు అగ్ర నిర్మాత‌గాను, డిస్ట్రిబ్యూట‌ర్‌గాను 20 ఏళ్లుగా ఇండ‌స్ట్రీని ఏక‌చ‌క్రాధిప‌త్యంతో ఏలేస్తున్నారు. ఒక‌ప్పుడు నైజాంలో డిస్ట్రిబ్యూట‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన రాజు ఈ రోజు ఇండ‌స్ట్రీని క‌నుసైగ‌ల‌తో శాసించే నిర్మాతగా ఉన్నారు. 20 ఏళ్ల‌లో ఆయ‌న బ్యాన‌ర్ నుంచి 50కు పైగా సినిమాలు రాగా.. అందులో 80 శాతం స‌క్సెస్‌ఫుల్ సినిమాలే. ఓ సినిమా తీస్తున్నామంటే క‌థ జ‌డ్జ్‌మెంట్ విష‌యంలో ఆయ‌న‌కు ఎంతో ప‌ట్టుఉంటుంది.. ప్రేక్ష‌కుల నాడిని ముందుగానే ప‌ట్టిన త‌ర్వాతే ఆయ‌న సినిమాకు ఓకే చెపుతారు.

అందుకే దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి సినిమా వ‌స్తుందంటే మామూలు అంచ‌నాలు ఉండ‌వు. అయితే థియేట‌ర్ల‌ను గుప్పెట్లో పెట్టుకుని నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆయ‌న‌పై కొన్ని విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. తాజాగా ఆయ‌న ఓ ప్ర‌ముఖ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్‌లో కాంబినేష‌న్ క‌లిపామా ? ఖ‌ర్చు పెట్టాం.. అమ్మేసేమా ? అంటూ నిర్మాత‌లు సేఫ్ గేమ్ ఆడుకుంటున్నారు.. డిస్ట్రిబ్యూట‌ర్లు రిస్కీ గేమ్ ఆడుతున్నారంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.

తెలుగులో సినిమాలు తీయ‌డం.. డిస్ట్రిబ్యూష‌న్ చేయ‌డం అనేది గాల్లో దీపం బిజినెస్ అని కూడా రాజు చెప్పారు. ఇక ప్రొడ్యుస‌ర్స్ కౌన్సెల్‌, మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కు ఎన్నిక‌లు ఎందుకు ? అన్నట్టుగా కూడా రాజు కామెంట్లు చేశారు. అయితే రాజు చేసిన ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల ఇండ‌స్ట్రీలో కొంద‌రు సీరియ‌స్‌గా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆయ‌న‌పై డిసిప్లిన‌రీ యాక్ష‌న్ తీసుకోవాల‌ని కొంద‌రు నిర్మాత‌లు ఒత్తిళ్లు చేస్తున్నార‌ట‌. అయితే ఇక్క‌డ మ‌రో క‌థ కూడా ఉంది. ఎప్పుడో గుర్తున్న‌ప్పుడు ఒక సినిమా చేసి మాలో మెంబ‌ర్ షిఫ్ తీసుకున్న వారు కూడా ర‌క‌ర‌కాలుగా మాట్లాడేస్తున్నారు.

జ‌మానా కాలంలో సినిమాలు తీసిన నిర్మాత‌ల‌తో పాటు ఒక‌టి, రెండు ఊరు పేరు లేని సినిమాలు తీసి నిర్మాత‌ల సంఘంలో స‌భ్యులుగా ఉన్న‌వాళ్లు కూడా ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్న నిర్మాత‌ల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘాల్లో యాక్టివ్‌గా లేని నిర్మాత‌ల సంఖ్యే ఎక్కువుగా ఉంటోంది. అలాంట‌ప్పుడు వాళ్లంద‌రు ఎందుకు అన్న‌దే దిల్ రాజు ప్ర‌శ్న‌. ఆయ‌న వ్యాఖ్య‌ల్లో నిజం కూడా ఉంది.

అంటే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డానికి యాక్టివ్‌గా ఉన్న వాళ్లే ఉండాలి.. రాజు వ్యాఖ్య‌ల్లోనూ ఇదే క‌నిపిస్తోంది. వ‌రుస‌గా సినిమాలు నిర్మించే నిర్మాత‌లే కావాలి.. ఎప్పుడో గుర్తున్న‌ప్పుడు సినిమాలు చేసే వాళ్లు అవ‌స‌ర‌మే లేదు. అందుకే ఇన్‌యాక్టివ్‌గా ఉండే నిర్మాత‌లు కొంద‌రు దిల్ రాజు మీద డిసిప్లిన‌రీ యాక్ష‌న్ అంటూ కారాలు మిరియాలు నూరుతున్నార‌ట‌. వాళ్ల ఉడ‌త ఊపుల‌కు రాజు బెదిరేర‌కం కాద‌న్న‌ది వాస్త‌వం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news