టైటిల్: ధమాకా
బ్యానర్: పీపుల్స్ మీడియా ప్యాక్టరీ
నటీనటులు: రవితేజ, శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేద్కర్, తనికెళ్ల భరణి, రావూ రమేష్, చిరాగ్ జానీ, ఆలీ, ప్రవీణ్ హైపర్, పవిత్రా లోకేష్, తులసి, రాజశ్రీ నాయర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్: భీమ్స్
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, వెంకట్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: బెజవాడ ప్రసన్న
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రన్ టైం: 130 నిమిషాలు
రిలీజ్ డేట్: 23, డిసెంబర్, 2022
మాస్ మహరాజ్ రవితేజ కెరీర్ ఒక్క హిట్టు.. మూడు నాలుగు ప్లాపులు అన్నట్టుగా కొనసాగుతోంది. మూడునాలుగేళ్లుగా ఒక్క హిట్టూ లేని రవితేజ క్రాక్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. అసలు క్రాక్‌కు ముందు రవితేజను జనాలు మర్చిపోయారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మనోడు ట్రాక్ తప్పేశాడు. కథ గాలికి వదిలేసి వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే ఈ యేడాది చేసిన ఖిలాడీ, రామారావు ఆన్‌డ్యూటీ రెండూ బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యాయి. రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఈ క్రమంలోనే రవితేజ తాజాగా హిట్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా సినిమా చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌ను ఊపేస్తోన్న కుర్ర భామ శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ రెండూ ప్రామీసింగ్ గా అనిపించాయి. మరి ధమాకాతో అయినా రవితేజ సక్సెస్ ట్రాక్ ఎక్కడా ? ఈ రోజు రిలీజ్ అయిన ధమాకా నిజంగా పేలిందో ? తుస్సుమందో TL సమీక్షలో చూద్దాం.
TL స్టోరీ:
చెల్లి (మోనికా రెడ్డి)కి పెళ్ళి చేయాలని స్వామి (రవితేజ) కష్టపడుతుంటాడు. అతడు చేసే ఉద్యోగం పోవడంతో ఆమె పెళ్లి చేసేందుకు తండ్రి తనికెళ్ల భరణితో కలిసి ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే టైంలో
పీపుల్స్ మార్ట్ గ్రూప్ కి కాబోయే సీఈవోగా తన కుమారుడు ఆనంద్ (రవితేజ)ని రంగంలోకి దింపాలని చక్రవర్తి (సచిన్ కేడ్కర్) ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆనంద్ అందుకు ఒప్పుకోడు. ఓ రోజు స్వామి చెల్లెలు ఆపదలో ఉన్నానని మెసేజ్ రావడంతో అక్కడకు వెళ్లిన స్వామికి ప్రణవి(శ్రీ లీల) కనిపిస్తుంది. ఆమెకు వెంటనే ప్రపోజ్ చేసేస్తాడు.
అనూహ్యంగా ప్రణవి తండ్రి రావూ రమేష్ ఆమెకు మరో రవితేజ ఆనంద్‌తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు. ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారని తెలుసుకున్న ప్రణవి షాక్ అయ్యి ఎవరిని చేసుకోవాలో తెలియక ఇద్దరితోనూ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో జేపీ (జయరాం) తన కుమారుడి కోసం పీపుల్స్ మార్ట్‌ను చాలా తక్కువ రేటుకే అమ్మేయాలని అనుకుంటాడు. అయితే జేపీ కాకుండా పీపుల్స్ మార్ట్‌ను దక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తుంటారు ? అసలు ఇద్దరు రవితేజల్లో ఆనంద్, స్వామి ఎవరు ? వీరిద్దరూ ఒక్కరేనా ? వేర్వేరునా ? అసలు ఈ కథలో మలుపులు ఏంటి ? ప్రణవి ఎవరిని చేసుకుంది అన్నదే ఈ సినిమా.
TL విశ్లేషణ :
గతంలో త్రినాధరావు – బెజవాడ ప్రసన్న కుమార్ కాంబినేషన్ సినిమాలు హిట్ అవ్వడంతో ధమాకా మీద కూడా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది. అసలు ధమాకా అన్న పేరు ఎందుకు ? పెట్టారో సినిమా చూస్తే తెలుస్తుంది. కథనం రొటీన్ వేలో ఉన్నా.. ట్విస్టులు మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయి. కామెడీ, డ్యాన్సులు, మ్యూజిక్, లవ్, రొమాన్స్,, యాక్షన్ ఎక్కడా తగ్గకుండా ప్రజెంట్ చేశారు. ఎమోషన్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది.
అన్నీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు టీం కథను నడిపించారు. 54 ఏళ్ల రవితేజ పక్కన 21 శ్రీ లీల హీరోయిన్గా ఎలా సరిపోతుందా ? అనుకున్న వాళ్లకు షాక్ ఇచ్చేలా ఇద్దరి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. రొటీన్ కథే అయినా కొత్త ట్రీట్‌మెంట్‌తో సినిమా ప్రేక్షకులను కొంత వరకు ఆకట్టుకుంది. సినిమా అంతా ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది.
నటనలో రవితేజ రెండు పాత్రల్లో విజృంభించాడు. ఎప్పటిలాగే తనకు కలిసొచ్చిన కామెడీని బాగా పండించాడు. యాక్షన్, డ్యాన్సుల్లో కుమ్మేశాడు. శ్రీలీల కూడా అందంతో పాటు నటనతో ఆకట్టుకుంది. డ్యాన్సుల్లో శ్రీలీల ఎనర్జీ సూపర్బ్. మిగిలిన నటుల్లో సచిన్ ఖేడ్కర్, జయరామ్, తనికెళ్ల భరణి, సీత, పవిత్ర లోకేష్, సమీర్, ప్రవీణ్, హైపర్ ఆది, రావు రమేష్ ఆకట్టుకున్నారు. కమెడియన్ ఆలీ రెండు సీన్లకే పరిమితం అయ్యాడు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
టెక్నికల్ గా దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు త్రినాధరావు నక్కిన చాలా ప్రయత్నం చేశాడు. గతంలో ఆయన సినిమాలకు మంచి పేరు రావడంతో దానిని నిలబెట్టుకునేందుకు ట్రై చేశాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ తీసుకున్న పాయింట్ బాగుంది. సినిమా రొటీన్‌గా ఉన్నా ట్రీట్‌మెంట్ బాగుంది. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. పాటలు బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలకు వంకలేదు.
ఫైనల్‌గా…
ధమాకా రొటీన్ టచ్‌తో కూడిన సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్. కావాల్సినంత కామెడీ, మాస్ సీన్లతో బాక్సాఫీస్ దగ్గర పాస్ అయ్యేలా ఉంది.
ఫైనల్ పంచ్ : రొటీన్‌గానే పాస్ అయ్యాడు
ధమాకా TL రేటింగ్ : 2.75 / 5