లెస్బియన్ పాత్రలను మనం గతంలో కేవలం హాలీవుడ్ సినిమాలలో మాత్రమే చూశాము. అలాగే, కొన్ని మలయాళ సినిమాలలోనూ చూశాము. కానీ, గత కొంతకాలంగా.. ఇంకా చెప్పాలంటే వెబ్ సిరీస్ వచ్చాక బాలీవుడ్‌తో పాటు మిగతా సౌత్ భాషలలోనూ చూస్తున్నాము. అది కూడా ఇలాంటి పాత్రలను స్టార్ హీరోయిన్స్ ఒప్పుకోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం.
ఏ హీరోయిన్ అయినా కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది. దీనిలో భాగంగానే చిన్న డ్రస్సులు వేసుకొని అందాల ఆరబోతతో మోత మోగిస్తుంది. అలాగే, హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీగా ఉంటుంది. బెడ్రూం సన్నివేశాలలో నటించడానికి ఏమాత్రం వెనకాడదు. కాంపిటీషన్ తట్టుకోవాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఒప్పుకోవాల్సిందే.
అయితే, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారంస్ వచ్చాక హీరోయిన్ పాత్రకి లిమిటేషన్ అనేది ఉండటం లేదు. ఎంత ఛాలెంజింగ్ రోల్ చేయాలన్నా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేస్తుంది. ఇక్కడ సౌలభ్యం ఏమిటంటే తమని తాము ఇంకో స్థాయిలో ఆవిష్కరించుకునే ఛాన్స్ అలాగే మంచి రెమ్యునరేషన్ ..రెండు లభిస్తాయి. ఇలాంటి అడ్వాంటేజస్ ఉన్నాయి కాబట్టే ప్రస్తుతం లెస్బియన్ పాత్రలు ఒప్పుకోవడానికి వెనకాడటం లేదు.
ఎప్పుడు కనీసం బొడ్డు కూడా చూపించని నిత్యా మీనన్ కూడా తన తోటి హీరోయిన్‌తో రొమాన్స్‌కి ఒప్పుకుంది. సమంత ఇప్పటికే ఓ హాలీవుడ్ సినిమాను ఒప్పుకుంది. మిగతా హీరోయిన్స్ కూడా ఇప్పుడు లెస్బియం రోల్ చేయడానికి ఇష్టంగా ఒప్పుకుంటున్నారు. అదీకాక ఇలా లెస్బియల్ రోల్ చేయడానికి అదనంగా కొంత రెమ్యునరేషన్ కూడా మేకర్స్ కలిపి ఇస్తారట. అందుకే, ఇప్పుడు అందరి టార్గెట్ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలోనే..!