మనిషి అన్నాక లైఫ్ లో కొన్ని కొన్ని సార్లు తప్పులు చేస్తూ ఉంటారు . అయితే అది తప్పు అని తెలిసి మళ్ళీ అదే తప్పును చేసే వాడిని మాత్రం జనాలు క్షమించరు. సామాన్య ప్రజలు అంటే ఓకే స్టార్ సెలబ్రెటీస్ కూడా తప్పు అని తెలిసిన సరే తప్పని పొజిషన్లో ఆ తప్పును చేస్తూ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ లిస్టులోకే వస్తాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ. డాడీ సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసిన బన్నీ .. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు .
మొదటి సినిమాతో పర్లేదనిపించుకున్న రెండో సినిమా బన్నీతో ఏకంగా తన ముద్దు పేరును బన్నీగా మార్చేసుకున్నాడు ఈ స్టైలిష్ స్టార్. కాగా ఆ తర్వాత కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా దూసుకుపోతున్న కెరియర్ కు బన్నీ తీసుకున్న తప్పుడు నిర్ణయం బ్రేక్ వేసింది. 31 మార్చి 2010 ఆయన హీరోగా నటించిన వరుడు సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో డైరెక్టర్ గుణశేఖర్ చేసిన ఓవర్ యాక్టింగ్ ఎంతో అందరికీ తెలిసిందే .
హీరోయిన్ ని దాచి పెట్టేసి.. కనీసం ఆడియో ఫంక్షన్ కూడా రానివ్వకుండా డైరెక్ట్ గా థియేటర్స్ లోనే చూడాలని ఒక పోస్ట్ర్ ని కూడా రిలీజ్ చేయలేదు. ఆ టైంలో నే ఈ సినిమా పై నెగిటివ్ అభిప్రాయం వ్యక్తం చేశారు . ఈ సినిమా ఫ్లాప్ తరువాత. ఎలాగోలా సెట్ అయిన బన్ని మళ్ళీ “నా పేరు సూర్య నా ఊరు ఇండియా” అనే సినిమా విషయంలో అదే తప్పు చేశారు. సినిమాలో కంటెంట్ లేకపోయినా సరే సినిమాకి ఓవర్ హైప్ ఇచ్చి సినిమాను బొక్క బోర్ల పడేలా చేసుకున్నాడు . ఈ క్రమంలోనే ఆ తర్వాత కూడా బన్ని తన కెరీర్ ని ఫామ్ లో తెచ్చుకోవడానికి చాలా ట్రై చేశాడు . ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న బన్నీ పుష్ప 2 సినిమాతో తన లెవెల్ ను మరో రేంజ్ కి తీసుకెళ్లాలని ట్రై చేస్తున్నాడు . ఇలా బన్ని తన లైఫ్ లో తెలిసో తెలియకో చేసిన తప్పులు సరిదిద్దుకోలేని తప్పులుగా మారిపోయాయి.