యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో విజయం సాధించటం అన్నది ఎంతోమంది యువకుల కల. భారతదేశంలోనే అత్యుత్తమ సర్వీసు ఇది. ఎంతోమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అయ్యేందుకు ఈ పరీక్షను రాస్తూ ఉంటారు. సివిల్స్ ఎగ్జామ్ గా ఈ పరీక్షకు పేరు ఉంది. దేశవ్యాప్తంగా సివిల్స్‌కు క్రేజ్ ఉంటుంది. జీవితంలో ఎంత మంచి స్థాయిలో ఉన్న సివిల్స్ లో విజయం సాధిస్తే వచ్చే కిక్ వేరుగా ఉంటుంది. దేశానికి సేవ చేసే అవకాశం సివిల్స్ రూపంలో ఉండడంతో.. యువత అడుగులు ఎక్కువగా సివిల్స్ వైపు ఉంటాయి.
ప్రతి యేటా లక్షల మంది సివిల్స్ రాస్తూ ఉంటారు. అయితే సివిల్స్ లో విజయం సాధించే వారి సంఖ్య మాత్రం వందలలో ఉంటుంది. ఇతర రంగాలు… ఇతర పనుల మీద అస్సలు కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. ఒక కఠోరమైన తపస్సు చేయాల్సి ఉంటుంది. అంత క్రేజీ ఉన్న యుపిఎస్సి ఎగ్జామును ఒక టీమిండియా క్రికెటర్ క్లియర్ చేసి ఈరోజు అఖిల భారత సర్వీసులో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. ఆ క్రికెటర్ ఎవరు అన్నది మీకు తెలుసా ? సాధారణంగా క్రీడల్లో ఆసక్తికరపరిచే వారికి చదువు అంతగా ఎక్కదు అని అంటారు కానీ అతడు మాత్రం మొక్కోవని దీక్షతో చదివి ఈ రోజు సివిల్స్ అధికారి అయ్యాడు.
ఆ క్రికెటర్ అమే ఖురేషియా. 1972లో మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఖురేషియా. ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగు పెట్టకముందే సివిల్స్ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నాడు. 17 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఖురేషియా తాను క్రికెటర్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా ఐఏఎస్ అయ్యేవాడిని అని చెప్పాడు.
సివిల్స్ పూర్తయిన కొద్ది రోజులకే ఖురేషియాకు జాతీయ జట్టు నుంచి పిలుపువచ్చింది. దేశం కోసం ఆడాలన్న కోరిక నెరవేర్చుకునేందుకు జాతీయ జట్టులోకి ఎంటర్ అయ్యాడు. 1999 పెప్సీ కప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో ఆరంగ్రేటం చేసిన మనోడు తొలి మ్యాచ్‌లోనే 45 బంతుల్లో 57 పరుగులు చేసి రాణించాడు. తర్వాత మ్యాచ్‌ల్లో మాత్రం అతడు సక్సెస్ కాలేదు.
కెరీర్ మొత్తం మీద 12 వన్డేలు ఆడిన ఖురేషియా కేవలం 149 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఖురేషియా తన చివరి వన్డే మ్యాచ్ కూడా శ్రీలంక మీదే ఆడాడు. మధ్యప్రదేశ్ తరపున 119 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఖురేషియా 7 వేలకు పైగా పరుగులు చేశాడు. 22 ఏప్రిల్, 2007న అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.