గత ఏడాదిన్నర కాలంగా తెలుగు సినిమా రంగంలోనూ.. తెలుగు సోషల్ మీడియాలను ఎక్కడ చూసినా ఎవరి నోట విన్న బాలయ్య నామస్మరణ జోరుగా జరుగుతోంది. ఇప్పుడు తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో జై బాలయ్య అన్నది ఒక కల్ట్ స్లోగన్ గా మారిపోయింది. ఎవరి నోట విన్న జై బాలయ్య అన్న నినాదం హోరెత్తిపోతోంది. ఏ హీరో అభిమాని నోటి నుంచి విన్నా… ఏ హీరో సినిమా థియేటర్లలో ఆడుతున్నా జై బాలయ్య అన్న స్లోగన్ గట్టిగా వినాల్సిందే.. అంతలా బాలయ్య మానియా ఇప్పుడు నడుస్తోంది.
బాలయ్యకు ఉన్న కొన్ని వ్యక్తిత్వాలే ఈ రోజు ఆయన్ను మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే భిన్నమైన వ్యక్తిగా నిలబెట్టాయి. బాలయ్యది భోళా మనస్తత్వం. ఆయన తాను లోపల ఏంటో అదే ప్రపంచానికి బయట చెప్పే ప్రయత్నం చేస్తాడు. దాపరికం అనేదే ఉండదు.. లోపల ఏది ఉందో బయటకు అదే వస్తుంది. తనను తాను హైప్ చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించడు. తన సినిమా ఎంత ? తన మార్కెట్ ఎంత ? తన స్థాయి ఎంతో బాలయ్య ఓపెన్‌గా చెప్పుకుంటాడు. అనవసరంగా లేనిపోని సెల్ఫ్ డబ్బాలు మోగించుకునేందుకు ఇష్టపడడు.
ఇన్ని దశాబ్దాలు అవుతున్నా కూడా బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. 1990వ దశకం ప్రారంభం నుంచి కూడా జై బాలయ్య అనేది ఓ కల్ట్.. ఈ తరం వాళ్లు కూడా జై బాలయ్య అనేందుకు ఎంత ఆసక్తి చూపుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఏ తరహా పాత్రలు అయినా పోషించే బాలయ్య ఎక్కువుగా రౌద్ర రసం ఇష్టపడతాడు. ఇక ఎవరన్నా ఆపదలో ఉన్నారని తెలిసినా, ఆయన్ను సంప్రదించినా బాలయ్య వెంటనే స్పందించి ఆదుకుంటాడు.
ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీ వాళ్లకు సాయం చేశాడు. అయితే ఇవేవి బాలయ్య బయట చెప్పుకోడు. ఇండస్ట్రీలో అతి సామాన్యులు ఆయనకు మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లే ఇవ్వడంతో పాటు స్పందించడం బాలయ్య గుణం. ఇక బాలయ్య ముందు నుంచి దర్శక నిర్మాతల హీరో. నిర్మాత ఎంత ఇస్తానన్నా బాలయ్య సినిమా చేస్తాడు. ఇక దర్శకుడి పనిలో బాలయ్య ఏనాడు జోక్యం చేసుకోడు. వీటితో పాటు రౌద్ర రస క్యారెక్టర్లు, డైలాగులు చెప్పడంలో బాలయ్య పౌరుషం ఇవన్నీ బాలయ్యను మాస్లో తిరుగులేని నెంబర్ వన్ హీరోగా నిలబెట్టేశాయి.