Moviesచచ్చే వరకు నాలో ఆ కోరిక తీరదు..తమన్నా కామెంట్స్ వైరల్..!!

చచ్చే వరకు నాలో ఆ కోరిక తీరదు..తమన్నా కామెంట్స్ వైరల్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. మిల్కీ బ్యూటీగా ట్యాగ్ చేయించుకున్న ఈ అమ్మడు ముట్టుకుంటే కందిపోతుందా..? అనంత అందంగా ఉంటుంది .అంతేకాదు చాలా టాలెంట్ మరీ ముఖ్యంగా క్రమశిక్షణ ఎక్కువ . అందుకే స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఆమెతో సినిమా చేయాలని ఎగబడుతూ ఉంటారు . ఒకప్పుడు తమన్నా అంటే ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ప్రెసెంట్ కుర్ర బ్యూటీల హవ్వతో తమన్న అందాల డోస్ తగ్గింది.. కానీ లేకపోతే ఇప్పటికీ ఆమె టాప్ హీరోయిన్ అని చెప్పాలి .

ఇక రీసెంట్గా ఆమె నటించిన బబ్లి బౌన్స్ర్ సినిమా డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే గుర్తుందా సీతాకాలం పైనే ఆశలు పెట్టుకోనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది . అంతేకాదు తాను రీసెంట్ గా తన పెళ్లిపై వస్తున్న వార్తలు పై కూడా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ..”గుర్తుందా సీతాకాలం సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చూశాక సత్యదేవ్ తో నటిస్తే బాగుండు అనిపించింది . అందుకే ఈ సినిమాలో నేనే అతని అడిగిమరీ పెట్టించుకున్నాను. కచ్చితంగా ఈ సినిమా పాజిటివ్ హిట్ అవుతుందని ఆశపడుతున్నాను”.

అంతేకాదు “ఈ మధ్యకాలంలో నా పెళ్ళిపై వార్తలు ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు డాక్టర్ ఆ తర్వాత వ్యాపారవేత్త ..రేపటి రోజు ఎవరితో రాస్తారో అంటూ భయంగా ఉంది. నా పెళ్లి విషయం ఏదైనా ఉంటే నేనే స్వయంగా అని చెప్తాను . అయితే పెళ్లయ్యాక హీరోయిన్గా చేసే ఆలోచనలు లేవు. నాకు నిర్మాతగా పనిచేయాలని కోరిక.. నా కోరిక తీర్చుకొని మంచి నిర్మాత అవ్వాలి అనుకుంటున్నాను.. మంచి సినిమా తీయాలి అనేది నా కోరిక ” అంటూ చెప్పుకొచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news