తెలుగు చిత్ర సీమలో అనేక సినిమాలకు సేద్యం చేసిన అన్నగారు ఎన్టీఆర్‌కు, అప్పటి అగ్ర నటుడు ఎస్వీఆర్‌తో ఎంతో అనుబంధం ఉండేది. తమ్ముడు అని ఎస్వీఆర్ పిలిస్తే.. అన్నయ్యా.. అని ఎన్టీఆర్ పిలిచేంత చనువు.. ఒకరింటి ఒకరు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పాతాళభైరవి సినిమాలో అప్పుడప్పుడే కెరీర్‌లో ఎదుగుతోన్న ఎన్టీఆర్.. విలన్‌గా నటించిన ఎస్వీఆర్‌ను ఎలా ? ఢీ కొట్టారో చూశాం.
ఒక సమయంలో అన్నగారు.. రాజకుమారుడి వేషం వేయాల్సి వచ్చింది. అదే తొలిసారి. ఈ సినిమాలో రాజకుమారుడు.. గుర్రం పై వేటకు వెళ్లే సీన్ చేయాలి. ఆ సినిమాలో తొలిసారి అరేబియన్ గుర్రాన్ని తీసుకువచ్చారు. ఇది పెద్ద పొగరుబోతు. ఎవరువచ్చినా.. అంతగా లొంగేదికాదు. అంతేకాదు, తన జోలికి ఎవరు వచ్చినా.. తిప్పి కొట్టేదట.
అయితే, అప్పటికే ఎస్వీఆర్ గుర్రపు పందేలకు వెళ్లడం.. స్వారీలు చేయడంలో దిట్టగా ఉండడంతో అన్నగారు ఆయన సలహా కోరారట. దీనికి ఆయన నలుగురిలోనే ఏం ఎప్పుడు గుర్రం పందేలకు వెళ్లలేదా ? అని ప్రశ్నించే సరికి.. తననేదో చులకన చేస్తున్నారని భావించిన ఎన్టీఆర్.. మూతి ముడుచుకున్నారట.
దీనిని గమనించిన ఎస్వీఆర్.. లేదు తమ్ముడూ.. సరదాగా అన్నాను.. అని.. తన ఇంటికి తీసుకువెళ్లి.. తన పెంపుడు గుర్రాలపై రెండు రోజలు పాటు ట్రైనింగ్ ఇచ్చారట. దీంతో తర్వాత వచ్చిన ప్రతి సినిమాలోనూ.. ఏదో ఒక సీన్‌లో గుర్రంపై ఉండే సీన్ చేయించుకునేవారట అన్నగారు.