మనదేశంలో హీరోయిన్ లకు ఎంత క్రేజీ ఉంటుందో చెప్పక్కర్లేదు. హీరోయిన్లను దేవతలుగా ఆరాధించి గుళ్ళు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు మహానటి సావిత్రిని తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులు దేవతగా ఆరాధించేవారు. అంత క్రేజ్ సొంతం చేసుకుంది.. ఆ మహానటి. తెలుగులో లేదు కానీ తమిళ సినీ జనాలు ఒక హీరోయిన్ ను దేవతల ఆరాధించి ఏకంగా గుళ్ళు కూడా కట్టేశారు. 1990వ దశకంలో ఖుష్బూకు తమిళనాడులో గుళ్ళు కట్టి పూజలు చేశారు. ఆ తర్వాత బొద్దుగుమ్మ నమితతో పాటు హన్సికకు సైతం చెన్నైలో గుళ్ళు కట్టారు.
విచిత్రం ఏంటంటే కోట్లాది మంది సిని ప్రేమికుల ఆరాధ్య దైవాలుగా, దేవతలుగా ఉండే హీరోయిన్లు తమ భర్తల ఎంపిక విషయంలో చాలా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. స్టార్ హీరోయిన్లు సైతం తమ భర్తలను ఎంపిక చేసుకునే విషయంలో తీసుకునే నిర్ణయాలు చిత్ర, విచిత్రంగా విడ్డూరంగా ఉంటాయి. స్టార్ హీరోయిన్ల భర్తలు అందంగా ఉండకపోవటం ఒక ఎత్తు అయితే… వాళ్లలో చాలామంది రెండో పెళ్లి భర్తలు వయసులో తమ కంటే చాలా పెద్దవాళ్లు కావటం మరో విచిత్రం. దేశంలో ప్రముఖ హీరోయిన్లందరూ కూడా రెండో పెళ్లి వ్యక్తిని పెళ్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. మహానటి సావిత్రి నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి విద్యాబాలన్ వరకు ఎంతో మంది హీరోయిన్లు రెండో పెళ్లి వాడిని మొగుడుగా చేసుకున్నారు. వీరంతా అలా ఎందుకు చేస్తున్నారంటే సమాధానం లేదు.
ఇక ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది. స్టార్ హీరోయిన్లు తమ కంటే వయసులో చాలా చిన్నోళ్లను మొగుళ్లను తెచ్చుకుంటున్నారు. మరికొందరు విదేశీ మొగుళ్లను కోరుకుంటున్నారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శిల్పా శెట్టి, రవీనాటాండన్ సైతం అప్పటికే పెళ్లయి భార్యలకు విడాకులు ఇచ్చిన భర్తలను రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లంతా తమ ముందు భార్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి.. వాళ్లతో పెళ్లి జీవితాన్ని తెగతెంపులు చేసుకున్న వారే. మరి ఏరి కోరి అలాంటి వాళ్ళని స్టార్ హీరోయిన్లు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు.
చాలామంది హీరోయిన్లు ముదురు వయసు వచ్చేవరకు పెళ్లి చేసుకోవడం లేదు. ఆ సమయంలో ఆర్థికంగా బాగా సెటిలై ఉన్న పారిశ్రామికవేత్తలను లేదా ఇతర రంగాల్లో టాప్ పొజిషన్లో ఉన్నవారిని భర్తలుగా కోరుకునేందుకు ఇష్టపడుతున్నారు. తమ స్టేటస్ కు తగినట్టు… తమ విలాసాలు తీర్చుకునేలా బాగా ధనవంతులైన భర్తలను మాత్రమే ఏరి కోరి మరి ఎంచుకుంటున్నారు. తమకు కాబోయే భర్తకు అప్పటికే ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి… అతడికి కాంట్రవర్సీ నేపథ్యం ఉందా ? అన్నది కూడా పట్టించుకోవడం లేదు. కేవలం డబ్బు కోసమే ప్రాధాన్యం ఇస్తున్నారు. శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాను ఎంత గుడ్డిగా నమ్మి మోసపోయిందో చూశాం.
అయితే విచిత్రంగా కొందరు స్టార్ హీరోయిన్లు వయసులో తమకంటే చిన్నవాళ్ళను కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ తనకంటే వయసులో నాలుగేళ్లు చిన్నవాడు అయినా మహేష్ బాబును పెళ్లి చేసుకుంది. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా వయసులో తనకంటే రెండేళ్లు చిన్నవాడైన ధనుష్ ను పెళ్లాడింది. ఐశ్వర్యరాయ్ తనకంటే ఏడాది చిన్నోడు అయినా హీరో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా కూడా వయసులో ఆమె కంటే చాలా చిన్నోడు. అతను మొదటి భార్యకు విడాకులు ఇచ్చి శిల్పాను పెళ్లి చేసుకున్నాడు.
ఇక బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ ఆలీఖాన్ వయస్సులో తనకన్నా 12 ఏళ్లు పెద్దది అయిన అమ్రితా సింగ్‌ను పెళ్లాడాడు. తమ వయసులో అంత తేడా ఉన్నా చాలా కాలం కాపురంచేశారు. ఆ తర్వాత సైఫ్ తనకన్నా చాలా చిన్నదైన కరీనా కపూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ ప్రఖ్యాత నటి నర్గీస్‌దత్ తనకన్నా చిన్నవాడైన సునీల్ దత్‌ను, బాలీవుడ్ దర్శకురాలు, ఫేమస్ డ్యాన్స్ డైరెక్టర్ ఫరాఖాన్ తనకంటే వయస్సులో చాలా చిన్నోడిని పెళ్లాడారు. అలాగే బాలీవుడ్ దర్శకనటుడు ఫర్హాన్ అక్తర్ భార్య, స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ భార్య కూడా వయస్సులో భర్తల కన్నా పెద్దోళ్లే. అయితే వీరిద్దరు భార్యలకు విడాకులు ఇచ్చేశారు.
ఏదేమైనా వయసులో తమకంటే చాలా పెద్దోళ్ళు అయిన భర్తలను పెళ్లాడిన హీరోయిన్లు ఉన్నారు. తమకంటే వయసులో చిన్నోళ్ళు అయిన భర్తలను పెళ్లాడిన హీరోయిన్లు ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే ప్రేమ కంటే కూడా ఆర్థికపరమైన అంశాలు, స్టేటస్.. విలాసాలు ఎంజాయ్ ఇవన్నీ కూడా ఎక్కడ కీలకంగా మారుతున్నాయి అన్నది అర్థమవుతుంది