తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో.. ఇప్పటికి అదే హ్యాండ్ సమ్ నెస్ ని మైంటైన్ చేస్తూ కుర్ర బ్యూటీలను సైతం మెల్డ్ చేస్తున్నారు . కాగా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ చేస్తూ మరోవైపు బిగ్ బాస్ గేమ్ షో ని హోస్ట్ చేస్తున్న నాగార్జున.. రీసెంట్గా జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో తన షోకి గెస్ట్ గా వచ్చిన శ్రీలీల తో ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా టృఎండ్ అవుతుంది.
మనకు తెలిసిందే భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ..నిన్నటితో ముగిసింది . మొదటి నుంచి విన్నర్ అవుతాడని అనుకున్న సింగర్ రేవంత్ ట్రోఫీ ని అందుకున్నాడు.. శ్రీహాన్ 40 లక్షల క్యాష్ తీసుకొని రన్నర్ గా మిగిలాడు. కాగా ఈ షో కి సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన రవితేజ – శ్రీలీల తో ఆట ఆడుకున్నాడు నాగార్జున . కాగా ఇదే క్రమంలో శ్రీలీల తో మాట్లాడుతూ ..ఆమెను ఓ రేంజ్ లో పొగిడేశారు .
ఇదే క్రమంలో ధమాకా లోని జింతాక జింతాక పాటను ఎన్నోసార్లు చూశాను అంటూ సీక్రెట్ ను బయట పెట్టాడు. కేవలం శ్రీలీల కోసమే నాగార్జున ఆ పాట చూశారట. అంతేకాదు స్టేజ్ పైన శ్రీ లీల తనతో ఎప్పుడూ నటిస్తుంది అంటూ స్ట్రైట్ గా అడిగేసాడు . దీంతో అక్కడ ఉన్న వారంతా షాక్ అయిపోయారు. మనకు తెలిసిందే నాగార్జున వయసుకి శ్రీలీల ఏజ్ కి అస్సలు సంబంధం లేదు. శ్రీలీల కూతురు వయసు కన్నా ఇంకా తక్కువగానే ఉంటుంది . మరి అలాంటి అమ్మాయితో నటించాలని నువ్వు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నాగార్జున ని ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు శ్రీ లీల ను మరీ మరీ ఓవర్గా పోగిడేసారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో నాగార్జునను మాటల మాయగాడు అంటూ ట్యాగ్ చేస్తున్నారు జనాలు