సినిమా ఇండస్ట్రీలో ఎంత హై రేంజ్ లో పొగిడేస్తారో ..అంతే హై రేంజ్ లో నిలువునా పాతాళానికి తొక్కేస్తారు. మీడియా ముందు కత్తి, తోపు, తురుము అంటూ పొగిడేసే హీరోలే.. మీడియా వెళ్లిపోయాక వాడు దద్దమ్మ , దేనికి పనికిరాడు అన్న కామెంట్లు కూడా చేస్తారు . ఇలాంటి సందర్భాలు మనం ఇండస్ట్రీలో ఎన్నో విన్నాం చూసాం. అయితే మనకు తెలిసినవి కొన్ని …తెలియనివి ఎన్నెన్నో జరుగుతుంటాయి . ఇండస్ట్రీలో అలాంటి ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో అంటే ఎప్పుడు చులకనే. ఆ విషయాన్ని చాలామంది హీరోలు ప్రూవ్ చేశారు . అలాంటి నెపోటిజం బాధలకు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలకు వచ్చిన నాని ఎంత క్రేజీ హీరోగా మారాడో అందరికీ తెలిసిందే . అయితే కెరియర్ స్టార్టింగ్ లో నానితో కలిసి నటించడానికి స్టార్ హీరోస్ ఎవరు ముందుకు రాలేదట . ఆయన సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి, డైరెక్ట్ చేయడానికి కూడా డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించలేదట.
కాగా నాని లోని టాలెంట్ ని గుర్తించిన ఓ టాలెంటెడ్ హీరో మాత్రం ఆయనతో సినిమా చేయడానికి ముందుకొచ్చి..నానిని ఎంకరేజ్ చేయడానికి సతవిధాల ట్రై చేశాడట. అయితే ఇండస్ట్రీలో నేను నాని ఫ్యాన్ అంటూ చెప్పుకునే హీరో స్టార్ హీరో అతని తొక్కేసాడని అతడు టాలెంట్ ఉన్న హీరో కావడంతో.. అతగాడు హీరో అయితే వాళ్లకి ఆఫర్స్ రావన్న భయంతోనే ఈ విధంగా ఆఫర్స్ రానివ్వకుండా చేశారన్న ఓ రూమర్ వైరల్ గా మారింది. అంతేకాదు అప్పటివరకు బెస్ట్ ఫ్రెండ్ అని నాని సైతం అనుకున్న ..ఆ హీరో నిజస్వరూపం తెలిసి అతని దూరం పెట్టాడట . ఏది ఏమైనా సరే ఫ్రెండ్షిప్ అన్న పదానికి పరువు తీసాడు ఆ హీరో అంటున్నాను నాని ఫ్యాన్స్.