ఆడదాని శాపం ఊరికే పోదు అంటుంటారు మన ఇంట్లోని పెద్దవాళ్ళు . బహుశా కాజల్ల విషయంలో అది నిజమే అనిపిస్తుంది. ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చూస్తేనే ముద్దు పెట్టుకునేయాలి అనిపించేస్తుంది, టాలీవుడ్ బడా బడా హీరోలనే తన అందాలతో మంత్రముగ్ధులను చేసింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి రోల్స్ అయినా సరే అవలీలగా నటించే కాజల్ ..చాలా సైలెంట్ అంటూ ఇండస్ట్రీలో పేరు కూడా ఉంది .
కోపం వచ్చినా సరే కాజల్ బయటపడదు . తనలో తాను బాధపడుతుంది కానీ పక్క వాళ్ళపై ఆ కోపం చూపించదు. కాగా ఇదే కాజల్ కెరియర్ కి మొదాట మైనస్ అయ్యిందట. కెరీర్ కొత్తల్లో సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న టైంలో ఓ డైరెక్టర్ ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని.. ఆమె..ఆయన డైరెక్షన్లో సినిమా కూడా చేసిందని.. అప్పుడు ఆమెకు ఇండస్ట్రీలో ఇలాంటివి ఉంటాయని తెలియవట. అప్పుడు ఆమె పెద్దగా ఫేమ్ లేదని ..ఈ క్రమంలోనే కెరియర్ స్టార్టింగ్ లో కాజల్ ని ఆ డైరెక్టర్ ఎంత టార్చర్ చేసినా.. సైలెంట్ గా ఉండిపోయింది అన్న న్యూస్ వైరల్ అవుతుంది .
అంతేకాదు కాజల్ అప్పుడు పెట్టిన శాపనార్ధాలు ఆ డైరెక్టర్ కి బాగా తగిలినట్లు ఉన్నాయి.. అందుకే ప్రజెంట్ అడ్రస్ లేకుండా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు ఆ డైరెక్టర్ అంటూ కాజల్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు .ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటూ తనదైన స్టైల్ లో ముందుకెళ్తుంది. ఇప్పుడు ఎవ్వరైన తనతో అలా బీహేవ్ చేస్తే ఎదురించే ధైర్యం వచ్చిందట..!!