ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో డివోర్స్ తీసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి పలు కారణాల చేత గొడవలు పడి.. క్యూట్ జంటలు విడాకులు బాట పడుతున్నారు. రోజురోజుకీ ఈ లిస్ట్ లో యాడ్ అయ్యే స్టార్స్ ఎక్కువైపోతున్నారు. కాగా ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ , హీరోయిన్స్, స్టార్ సెలబ్రిటీస్ అందరూ తమ పార్ట్నర్స్ కు విడాకులు ఇచ్చి.. వేరే వాళ్ళతో కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే.
కాగా ఇదే విషయంలో టాలీవుడ్లో మరో బిగ్ డివర్స్ జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీళ్లు డివర్స్ కంఫామ్ అయ్యిన్నట్లు సినీ వర్గాలల్లో ఓ టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో ఉండే బడా ఫ్యామిలీ లో బిగ్ ఫ్యామిలీ కి సంబంధించిన కొడుకు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే ఒకసారి లవ్ ఫెయిల్యూర్ తో బాధపడిన ఈ స్టార్ సన్..తల్లిదండ్రుల కోసం మరో పెళ్లి చేసుకున్నాడు.
అయితే ఆమెతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా డివోర్స్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడట . ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సదరు కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా హీరోలే కావడం తో ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నాయి అన్నది మాత్రం వాస్తవం. దీనికి ఎప్పుడు బ్రేక్ పడుతుందో కూడా అర్థం కావడం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు.