శ్రీ రెడ్డి ఈ పేరు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనం.. ఓ ప్రకంపనం. అసలు నాలుగేళ్ల ముందు వరకు శ్రీరెడ్డి గురించి పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. 2018 నుంచి శ్రీరెడ్డి కాంట్రవర్సీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పాపులర్ అయింది. హీరోయిన్ అవుదామనుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీరెడ్డి. అయితే ఆ టైంలో ఆమెకు అవకాశాలు ఇస్తామని కొందరు రకరకాలుగా వాడుకుని మోసం చేశారు. శ్రీరెడ్డిని టాలీవుడ్‌కు చెందిన కొందరు స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు.. నిర్మాతలు సైతం శారీరకంగా వాడుకుని వదిలేసారు.
అయితే ఎవరు ఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆమె బయటకు వచ్చి నా రచ్చ రచ్చ చేసింది. మా ఆఫీసు ముందు అర్ధ నగరంగా కూర్చొని తనకు న్యాయం చేయాలని చేసిన గొడవ పెద్ద సంచలనం సృష్టించింది. ఇది మీడియాలో బాగా పాపులర్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమె సినిమా, రాజకీయ నాయకుల మీద చేసిన విమర్శలు, కాంట్రవర్సీ వ్యాఖ్యలతో బాగా పాపులర్ అయిపోయింది.
ఇప్పుడు శ్రీరెడ్డి అంటే తెలుగు జనాల్లో తెలియని వారు చాలా చాలా తక్కువ.. స్టార్ హీరోలు, హీరోయిన్ల రేంజ్లో ఆమెకు పాపులారిటీ వచ్చేసింది. ఇక దగ్గుబాటి వారసుడు అయిన దగ్గుబాటి అభిరామ్ కూడా తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అభిరామ్ ఇటు సురేష్‌బాబు తనయుడు, రానాకు తమ్ముడు కావడంతో శ్రీరెడ్డి విమర్శలు ఒక్కసారిగా సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్ అయ్యాయి.
అయితే తాజాగా ఇప్పుడు మరోసారి అభిరామ్‌ను శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. నానక్‌రామ్ గూడ వద్దనున్న రామానాయుడు స్టూడియోను సురేష్‌బాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కు ఇచ్చేస్తున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు పనుల కోసం ఈ స్టూడియోను తొలగిస్తున్నారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ ఆ స్టూడియోను ఎందుకు మాయం చేస్తున్నార్రా బాబు నాకు, దగ్గుబాటి అభిరామ్‌కు ఫస్ట్ నైట్ జరిగింది అక్కడే అంటూ చెప్పుకొచ్చింది.
ఇప్పుడు మీరు ఆ స్టూడియోను ఇష్టం వచ్చినట్టు చేస్తే మా మెమరీస్ అన్నీ పోతాయని.. మా జ్ఞాపకాలు ఏమైపోవాలంటూ వ్యంగ్యంగా చెప్పుకు వచ్చింది. ఏదేమైనా శ్రీరెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీని ఎప్పుడూ ఏదోలా కెలుకుతూనే ఉంటోంది. అభిరామ్ ఫస్ట్ సినిమా అహింస కూడా ప్లాప్ అవ్వాలంటూ విమర్శలు చేసింది.