ఓల్డ్ హీరోయిన్లకు.. అన్నగారు ఎన్టీఆర్‌కు మధ్య అనేక విషయాల్లో సూచనలు-సలహాలు.. నడుస్తుండేవి. రామారావు.. ఎక్సయిర్ సైజ్ చేస్తే.. బాలీవుడ్ కు వెళ్లిపోతారు.. ఆ సలహా మాత్రం ఇవ్వకండి! అని తరచుగా సావిత్రి అనేదట. సావిత్రి – ఎన్టీఆర్ మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఉండేది. కెరీర్ ముందు నాళ్లలో సావిత్రి కూడా ఎన్టీఆర్ చెప్పిన మాటకు విలువ ఇచ్చేవారట. అయితే ఆ తర్వాత ఆమె కంట్రోల్ తప్పేసి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం… చివరకు జెమినీ గణేషన్‌ను పెళ్లి చేసుకుని అన్ని విధాలా పతనం అయిపోవడం జరిగాయి.
ఇక, అప్పట్లో సావిత్రికన్నా ముందు.. తెలుగు తెరను ఓ రేంజ్‌లో ఏలిన నటీమణి శ్రీరంజని. ఈమె దూకుడు ఉన్న నటీమణికాదు. తర్వాత తెరమీదకెక్కిన సావిత్రి, అంజలీదేవి, భానుమతి మాదిరిగా శ్రీరంజని డ్యాన్స్‌లు చేసే వారు కాదు. పైగా డైలాగ్ డెలివరీ కూడా నెమ్మదిగా సాగేది. అయితే..అ ప్పట్లో ప్రజలు ఆమె భావభావాలకు అలవాటు పడ్డారు.
దీంతో దశాబ్దం పాటు అనేక సినిమాల్లో హీరోయిన్‌గా శ్రీరంజని నటించారు. తర్వాత.. సావిత్రి, కన్నాంబ వంటి వారు వచ్చేసరికి శ్రీరంజని వెనుకబడ్డారు. ఒక సమయంలో ఒకవైపు ఎన్టీఆర్‌కు హీరోయిన్‌గా నటిస్తూ.. మరో సినిమాలో చెల్లి పాత్రను ధరించాల్సి వచ్చింది. దీనికి కారణం.. రెండో సినిమా డ్యాన్స్ ఓరియెంట్ మూవీ.
దీనికి శ్రీరంజని సరిపోరని భావించిన దర్శకుడు.. ఆమె ఆదరణను చూసి.. ఆమెను చెల్లి పాత్రకు తీసుకున్నారు. ఇదే విషయాన్ని అన్నగారు శ్రీరంజనితో ప్రస్తావిస్తూ.. అమ్మాయ్‌గారూ.. అప్డేట్ అవ్వాలండీ.. అప్డేట్..! అనేవారట. అయితే, శ్రీరంజని సైలెంట్ కదా.. నవ్వి ఊరుకునేవారట. దీంతో ఎంతో నటనా కౌశలం ఉన్నప్పటికీ.. ఆమె వెనుక బడిపోయారు.