తెలుగు చిత్రసీమలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారిది ప్రత్యేక స్థానం. ఎంతోమంది హీరోలను హీరోయిన్లను రాఘవేంద్రరావు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసారు. అంతేకాకుండా ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్న చాలామంది రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసినవాళ్లే.. రాజమౌళి సైతం ఆయన శిష్యుడే. అదేవిధంగా తెలుగు సినిమాలలో సిల్క్ స్మిత కు కూడా ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. స్పెషల్ సాంగ్స్ మరియు వ్యాంప్ పాత్రలు చేసినప్పటికీ సిల్క్ కు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది.
స్టార్ హీరోలు తమ సినిమాలలో సిల్క్ స్మిత ఉండాలని అనుకునేవారు. దర్శక నిర్మాతలు సిల్క్ డేట్స్ కోసం వెయిట్ చేసేవారు. అయితే ఒకానొక సమయంలో సిల్క్ స్మిత, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మధ్య గొడవ జరిగింది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది…? ఆ తర్వాత ఏం జరిగింది..? అనే వివరాలు కాస్త ఆసక్తిగానే ఉంటాయి.
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సిల్క్ స్మితను తీసుకున్నారు. కాగా పాట షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత సెట్‌లోకి రాగానే రాఘవేంద్రరావు ఆమెను చూడగా సిల్క్ స్మిత అప్పుడే నిద్ర లేచి వచ్చినట్టుగా కనిపించింది. అది గమనించిన దర్శకేంద్రుడు తల సరిగా చేసుకుని సెట్ లోకి రావాలని సిల్క్ కు చెప్పారు. కానీ షూటింగ్ ప్రారంభించే సమయానికి కూడా సిల్క్ స్మిత అలానే ఉన్నారు.
అంతేకాకుండా సిల్క్ స్మిత తన హెయిర్ స్టైల్ బానే ఉంది అంటూ దర్శకేంద్రుడికి ఎదురు సమాధానం ఇచ్చారు. ఆమె ప్రవర్తన నచ్చని రాఘవేంద్రరావు షూటింగ్ పూర్తిచేయడం కోసం…. నీ ఇష్టం అంటూ పాట చిత్రీకరణ మొదలుపెట్టారట. ఇక ఆ పాట కొంత భాగం పొగ మంచు వాతావరణంలో ప్లాన్ చేశారు. అందుకోసం సెట్ ను రెడీ చేశారు. అయితే సిల్క్ స్మిత పొగ మొత్తం బయటకి పోయేలా అక్కడే ఫ్యాన్ వేసుకుని కూర్చుని షూటింగ్ కు అంతరాయం కలిగించారు.
దాంతో సిల్క్ స్మిత ప్రవర్తన రాఘవేంద్రరావు తో పాటు నిర్మాత దేవి వరప్రసాద్ కు సైతం నచ్చలేదు. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదు. సిల్క్ ను ఆ సినిమా నుండి తొలగించి జయమాలినితో పాట చిత్రీకరణ పూర్తిచేశారు.