టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో రాజ్‌తరుణ్ – స్టార్ యాంకర్ లాస్య బావమరదల్లు అవుతారా ? వీరిద్దరు గతంలో ప్రేమించుకున్నారా ? పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా ? అసలు ఈ ప్రశ్నలే చాలా ఇంట్రస్టింగ్‌గా ఉన్నాయి కదా ? అవును ఈ సోషల్ మీడియా యుగంలో కొందరు గాసిప్ రాయుళ్లు, వెబ్సైట్లలో పుకార్లు పుట్టించేవారు ఇలాగే రాసేశారట. దీంతో లాస్య ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అయ్యిందట.
అసలు రాజ్‌తరుణ్‌తో సంబంధమే లేకుండా లాస్యకు రాజ్‌కు లింకులు పెట్టేశారట. రాజ్ తరుణ్ – లాస్య ఇద్దరూ సీక్రెట్‌గా లేచిపోయారు… సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు అని పుకార్లు రాసేశారట. ఆ తర్వాత వారిద్దరి పెళ్లి గురించి.. అసలు వాళ్లకు సంబంధం లేదని ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారట. ఈ పుకార్లపై లాస్య తర్వాత తన భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది.
అసలు తాను రాజ్‌తరుణ్‌తో కనీసం వర్క్ కూడా చేయలేదు… ఒక ఆడియో ఫంక్షన్ కోసం నేను రాజ్‌తరుణ్, నోయల్ కలిసి ఓ హోటల్లో ఉన్నామని.. తాము రాజ్‌తరుణ్‌తో సెల్ఫీ తీసుకున్నానని.. అయితే నోయల్‌ను లేపేసి.. తాను రాజ్‌తరుణ్‌తో ఉన్న సెల్ఫీ ఫోటోనే వైరల్ చేసి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారని లాస్య వాపోయింది. తాను రాజ్‌తరుణ్‌తో సెల్ఫీ తీసుకోవడమే తప్పయ్యింది అనుకున్నాను అని లాస్య చెప్పింది.
అసలు ఇలా ఎందుకు చేశారు ? ఎవరు చేశారు ? ఎవరు రాయిస్తున్నారా ? అన్నది నాకు అర్థం కాలేదు. ఇక నేను రవి – షోలు చేశాం… ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది కాబట్టి రాశారు అనుకోవచ్చు.. కానీ రాజ్‌తరుణ్‌తో ఇలా ఎందుకు పుకార్లు పుట్టించారో తెలియట్లేదని ఆమె చెప్పింది. ఇక రాజ్‌తరుణ్‌తో తాను తీసుకున్న ఆ సెల్ఫీ అప్లోడ్ చేసినప్పుడు కాకుండా ఆరు నెలల తర్వాత ఇలా రియాక్ట్ అయ్యారని ఆమె తెలిపింది.
అయితే ఇలాంటి రూమర్ల వల్ల ఫేమ్ కావచ్చు.. కానీ 70 శాతం మంది డిస్టర్బ్ అవుతారు.. చివరకు తాను సూసైడ్ ఎటెంప్ట్ చేశానని వార్తలు వచ్చినప్పుడు అసలు ఈ ఫీల్డ్‌లో ఉండొద్దు అని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారని.. రియాల్టీ తెలుసుకోకుండా రాస్తే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని లాస్య ఆవేదన వ్యక్తం చేసింది.