మాస్ మహారాజా రవితేజ ఒకప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యి.. మహేష్ మూడున్నర సంవత్సరాలు సినిమాలు చేయనప్పుడు వరుస హిట్లతో దూసుకుపోయాడు. అప్పట్లో జనాలు ఈ ముగ్గురు హీరోల సినిమాల కోసం మొహం వాచిపోయి ఉన్నారు. వీళ్ల సినిమాలు రావట్లేదు.. వచ్చినా ప్లాప్ అయ్యేవి. దీంతో వాళ్లకు రవితేజ ఆప్షన్ అయ్యాడు.
మాస్ హిట్లతో రవితేజ ఓ వెలుగు వెలిగిపోయాడు. తర్వాత రవితేజ వరుస ప్లాపులతో ఎవ్వరూ పట్టించుకోని స్థితికి దిగజారిపోయాడు. క్రాక్ సినిమాకు ముందు వరకు ఐదారు ప్లాపులు పడ్డాయి. క్రాక్ ఊపిరి పోసింది. ఆ తర్వాత ఖిలాడీ, రామారావ్ ఆన్‌డ్యూటీ రెండూ ఘోరాతి ఘోరమైన డిజాస్టర్లు. ఈ మధ్యలో నేచురల్ స్టార్ నాని, రామ్, నితిన్ లాంటి హీరోలు మంచి హిట్లతో రవితేజ ప్లేస్ ఆక్రమించేశారు.
ఇక టైర్ టు హీరోల్లో నిఖిల్, అడవి శేష్ కూడా వరుస హిట్లతో రవితేజను పూర్తిగా తొక్కి పడేశారు. అసలు రవితేజకు మళ్లీ హిట్ వస్తుందా ? వచ్చినా తన రేంజ్ హిట్ తగులుతుందా ? పైన చెప్పుకున్న కుర్ర హీరోల స్థాయికి మళ్లీ వస్తాడా ? అన్న సందేహాలే ఇప్పటి వరకు అందరిలోనూ ఉన్నాయి. అయితే ధమాకా సినిమా రవితేజ స్టామినా ఏంటో చెప్పడం కాదు.. రవితేజ కెరీర్ మొత్తం మీద ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది.
ధమాకా దెబ్బతో టైర్ 2 హీరోల్లో రవితేజ మళ్లీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు నాని, నితిన్, రామ్ వరుస ప్లాపులతో రేసులో వెనక్కు వెళ్లిపోయారు. ఇక సాయిధరమ్ మార్కెట్ డౌన్ అయ్యింది. కార్తీకేయ 2తో నిఖిల్ పాన్ ఇండియా హిట్ కొట్టినా, ధమాకాతో పోటీపడిన నిఖిల్ 18 పేజెస్ తేలిపోవడంతో రవితేజదే పై చేయి అయ్యింది.
కేవలం వారం రోజులకే రు. 62 కోట్ల గ్రాస్ వసూళ్లతో అసలు ఇది ఏ రేంజ్ హిట్‌కు వెళుతుందో ఊహకే అందని విధంగా బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్సామెన్స్‌తో ధమాకా బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం చూపిస్తోంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహించగా… భీమ్స్ సిసిరాలియో సంగీతం అందించారు.