మాస్ మహరాజ్ రవితేజకు గతేడాది వచ్చిన క్రాక్ తర్వాత సరైన హిట్ పడలేదు. ఈ యేడాది చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఖిలాడీ, రామారావ్ ఆన్‌డ్యూటీ రెండు సినిమాల దెబ్బతో రవితేజ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. అసలు రవితేజ సినిమాలకు మార్కెట్ ఉంటుందా ? ఈ సినిమాలు ఎవరైనా కొంటారా ? అన్న సందేహాల మధ్యలో ధమాకా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా దర్శకుడు నక్కిన త్రినాథరావు గతంలో చేసిన సినిమాలు కాస్త ప్రామీసింగ్‌గా అనిపించడంతో పాటు ట్రైలర్ బాగుండడంతో పాటు శ్రీలీల అందాలు చూసి బాగానే బిజినెస్ అయ్యింది. సినిమాకు పోటీగా నిఖిల్ కార్తీకేయ 18 పేజెస్ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇప్పుడు ధమాకా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో దుమ్ము రేపుతోంది.
కేవలం 5 రోజుల్లోనే రు. 49 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా 6 రోజులకు రు. 56 కోట్ల మాసివ్ మార్క్ ని అందుకుంది. ఈ వసూళ్లు రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా నిలిచాయి. ఈ వసూళ్లతో రవితేజ కెరీర్‌లో మరో రు. 50 కోట్ల సినిమా చేరినట్లయ్యింది. నిఖిల్ 18 పేజెస్ హవా క్లాస్ సెంటర్లు, క్లాస్ ప్రేక్షకులకు పరిమితం కావడంతో ధమాకా హవాకు బాక్సాఫీస్ దగ్గర అడ్డే లేదు.
మరో వారం రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ధమాకాకు అడ్డే లేదని అంటున్నారు. ఫైనల్ రన్‌లో ఈ సినిమా రు. 80 – 90 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లు రాబడుతుందని అంటున్నారు. సంక్రాంతి సినిమాల హడావిడి స్టార్ట్ అయ్యే వరకు థియేటర్లలో ధమాకానే ఉండేలా ఉంది.