మాస్ మహారాజ రవితేజ కెరీర్ గత కొంత కాలంగా పడుతూ లేస్తూ వస్తోంది. ఆరేడు ప్లాప్ సినిమాల తర్వాత గతేడాది క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రవితేజ కెరీర్‌కు ఊపిరి లూదింది. కరోనా టైంలో వచ్చి కూడా బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఈ సినిమా దెబ్బతో రవితేజ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది.
క్రాక్ తర్వాత రవితేజకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే మళ్లీ వరుస ప్లాపులు. ఈ యేడాది రెండు బిగ్గెస్ట్ డిజాస్టర్లు పడ్డాయి. ఖిలాడీ, రామారావు ఆన్‌డ్యూటీ రెండు సినిమాలు ప్లాప్. ఇక తాజాగా రవితేజ ఈ యేడాది ముచ్చటగా మూడో హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా నిన్న రిలీజ్ అయ్యింది. శ్రీలీల హీరోయిన్గా నటించింది.
నిన్న నిఖిల్ 18 పేజెస్ సినిమాకు పోటీగా వచ్చిన ఈ సినిమా సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుంది. రవితేజ నుంచి చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా.. ఆ రేంజ్ టాక్ అయితే వచ్చింది. అలాగే ధమాకా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా సాలీడ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే వసూళ్లు చూస్తే బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటినట్టుగానే కనపడుతోంది..
ధమాకా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రు. 10 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీంతో ఇది రవితేజ కెరీర్ లో ఇది మరో బెస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది. ఇక నిన్న సాయంత్రం నుంచి ఈ సినిమా బీ, సీ సెంటర్లలో మరింత స్ట్రాంగ్‌గా ఫికప్ అవుతోంది. ఈ వీకెండ్లో కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ధమాకాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురులేదనే చెప్పాలి.