నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఒకప్పుడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ కన్నడ సుందరి.. ప్రజెంట్ సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతుంది . దానికి వెనక ఉన్న కారణం అందరికీ తెలిసిందే . స్టార్ట్ డైరెక్టర్ కం నటుడు రిషిబ్ శెట్టితో ఆమెకు ఉన్న గత విభేదాలు ఇందుకు కారణం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా రోజురోజుకి సోషల్ మీడియాలో రష్మిక మందన్నా పేరుపై ఫేక్ వార్తలు ఎక్కువ అవుతుండడంతో.. ఆమె సైబర్ క్రైమ్ కు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడిందట . అంతేకాదు కన్నడ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేస్తుందని ..ఆ కారణంగానే ఆమె పలు అవకాశాలను దక్కించుకోలేకపోతుందని ..నెగిటివ్గా ప్రచారం చేస్తున్న ఓ భజన బ్యాచ్ పై రష్మిక మందన గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు డైరెక్టర్ లకు ఆ ఆలోచన లేకపోయినా సరే రష్మిక మందన పై ట్రోల్ చేస్తున్న జనాలను చూసి ఆమెకు కొత్త అవకాశాలు రావట్లేదని బాధపడుతుందట.
ఈ క్రమంలోనే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది . నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉన్న రష్మిక మందన.. ఒక్కసారిగా ఇలా సీరియస్ అవ్వడంపై జనాలు కూడా షాక్ అయిపోతున్నారు . కాగా ఒకవేళ నిజంగా రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే ..ఆమె ఇక చెక్కభజన చేసుకోవాల్సిందే అన్న వార్తలు వినిపించాయి . ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన ఎక్కువ సీరియస్ అయినట్లు తెలుస్తుంది .చూడాలి మరి రష్మిక మందన్నా.. లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవుతుందో..?