సౌత్ ఇండియాలో ఎంతో క్రేజ్ ఉన్న రష్మిక ఇటీవల తరచుగా ఏదో ఒక వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. తెలుగులో వరుస హిట్లతో స్వింగ్‌లో ఉన్న ఆమెకు బాలీవుడ్లో పుష్ప సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. పుష్ప సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్లో కూడా పుష్ప సినిమా ఏకంగా ఎలాంటి ప్రమోషన్లు లేకుండా రు. 100 కోట్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన రష్మిక ఇప్పుడు ఏకంగా ముంబైలోనే ఉంటోంది. ముంబైలో ఖరీదైన ప్లాటు కొనుక్కున్న ఆమె బాలీవుడ్లో అవకాశాల కోసం ట్రైల్స్ వేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె బాలీవుడ్లో నటించిన తొలి సినిమా మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రష్మికక తక్కువ టైంలోనే మంచి స్టార్డమ్ వచ్చినా కూడా ఆమె యాట్యిట్యూడ్ చూపిస్తూ ఆమె అభిమానులు, నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతోంది..
కొద్ది రోజుల క్రితమే రష్మిక కన్నడ సినిమా కాంతారాతో పాటు ఆ సినిమా దర్శకుడు రిషబ్ శెట్టిపై చేసిన వ్యాఖ్యలతో కన్నడీగులు ఆమెపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చివరకు ఆమె వివరణ ఇచ్చుకున్నా రష్మికపై కన్నడీగుల ఆగ్రహం తగ్గలేదు. చివరకు ఆమెను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలన్న ఆలోచన వరకు వెళ్లిందంటే ఆమెపై సొంత ఇండస్ట్రీ జనాలు ఎంతగా ఆగ్రహంతో ఉన్నారో తెలుస్తోంది.
ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యల వేడి చల్లారిందో లేదో ఇప్పుడు వెంటనే మరో కాంట్రవర్సీలో ఆమె చిక్కుకుంది. బాలీవుడ్‌పై పరిశ్రమపై ప్రశంసలు కురిపించిన రష్మిక నార్త్ ఇండస్ట్రీపై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయి.. దక్షిణాదిలో అన్నీ మసాలా సాంగ్లే ఉంటాయని చెప్పింది. తాను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సాంగ్స్ వింటూనే పెరిగానని.. సౌత్‌లో అన్నీ ఐటెం నెంబర్లు, మసాలా సాంగ్లే ఉంటాయంటూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది.
రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సౌత్ సినీ జనాలు మండిపడుతున్నారు. ఆమెను తిరుగులేని స్టార్ హీరోయిన్ను చేసిన సౌత్ సినిమాపై ఇంత చిన్నచూపు చూసేలా మాట్లాడడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏదేమైనా రష్మిక తన స్టార్డమ్ చూసుకుని తలపొగరుతో మాట్లాడుతోందని.. ఆమె తన బిహేవియర్ మార్చుకోకపోతే త్వరలోనే ఆమె కెరీర్ పతనం అయ్యేందుకు ఎంతో టైం పట్టదని కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.