బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. సోహైల్ ముందుగా సీరియల్స్‌లో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఎప్పుడు అయితే బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడో ఒక్కసారిగా తెలుగు జనాల్లో మాంచి పాపులర్ అయిపోయాడు. ప్రతి ఇంట్లో వాళ్లు సోహైల్‌ను మన ఇంటి పిల్లోడే అన్న రేంజ్‌లో ఓన్ చేసుకునేంత గుర్తింపు వచ్చింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమనేషన్ రౌండ్‌లోకి వెళ్లిన ప్రతిసారి సోహైల్‌కు లక్షల్లో ఓట్లేసేవారు. ఆ దెబ్బతో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ నుంచి సైడ్ అయిపోయి హీరో అయ్యాడు. ఈ క్రమంలోనే సోహైల్ నటించిన లక్కీ లక్ష్మణ్ సినిమా రేపు వస్తోంది. మామూలుగా కొత్త హీరో సినిమా అంటే పెద్ద అంచనాలు, హడావిడి ఉండదు. కానీ సోహైల్ సినిమాకు ఏపీ, నైజాంఆ, సీడెడ్‌లో భారీ ఎత్తున హంగామా నడుస్తోంది.
నైజాంలో మంచి కౌంట్ థియేటర్లతో లక్ష్మణ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హైదరాబాద్ సిటీలో పబ్లిసిటీ అదిరిపోయింది. థియేటర్లలో ధమాకా, 18 పేజెస్ ఉన్నా మంచి థియేటర్లే ఈ సినిమాకు ఇచ్చారు. ఓ వైపు కొన్ని స్క్రీన్లలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఫుల్స్ అవుతున్నాయంటే సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. ముఖ్యంగా లక్కీ లక్ష్మణ్ సొహైల్ కెరీర్‌ను డిసైడ్ చేయనుంది.
ఆంధ్రా, నైజాంలో కలిపి 200 + థియేటర్లలో సినిమా వస్తోంది. అబ్రాడ్‌లో 35కు పైగా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. సినిమాను అవుట్ రైట్‌గా రు. 8 కోట్లకు కొంటామని బంపర్ ఆఫర్ వచ్చింది. అయితే కంటెంట్‌పై నమ్మకంతో నిర్మాత హరిత గోగినేని ఎవ్వరికి రైట్స్ ఇవ్వకుండా అన్ని ఏరియాల్లోనూ ఓన్‌గా రిలీజ్ చేసుకోవడాన్ని బట్టి చూస్తే సినిమా విజయంపై వీరు ఎంత కాన్పిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతోంది. ఏసియన్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఏఆర్. అభి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు డైరెక్షన్ చేసిన ఈ సినిమాకు మహిళా ప్రొడ్యుసర్ హరిత గోగినేని కావడం.. సోహైల్ ఇమేజ్‌తో పాటు కథను నమ్మి భారీగా ఖర్చు పెట్టడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చలే నడుస్తున్నాయి లక్ష్మణ్‌పై. ఇక లక్కీ లక్ష్మణ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓ వైపు నవ్విస్తూనే ఉంటుందని.. మరోవైపు ఏడిపిస్తుందని.. ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. మరి సోహైల్ లక్ ఈ సినిమాతో ఎంత వరకు టర్న్ అవుతుందో ? చూడాలి.