ఇప్పటికే భార్యప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. కర్నూలు జిల్లాకు చెందిన దివంగత రాజకీయ నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె మౌనిక రెడ్డితో మనోజ్ వివాహం జరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరి పెళ్లికి వచ్చే యేడాది ఫిబ్రవరి 2న ముహూర్తం సెట్ చేసినట్టు తెలిసింది.
ఇటు మనోజ్‌తో పాటు అటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. వీరిద్దరు వేర్వేరు కారణాలతో తమ మొదటి సంసార బంధాన్ని తెంచుకున్నారు. మనోజ్‌కు తొలి వివాహంతో పిల్లలు లేరు. మౌనికకు మాత్రం మొదటి భర్తతో ఓ అబ్బాయి ఉన్నాడు. ఇక వీరిద్దరు కలిసి శుక్రవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకెళ్లారు. ఈ రోజు శోభా నాగిరెడ్డి వర్థంతి కావడంతో తల్లికి నివాళులు అర్పించేందుకు మనోజ్.. మౌనికను వెంటపెట్టుకుని మరీ భూమా ఘాట్‌కు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు.
అయితే వీరిద్దరి పెళ్లి ఇరు కుటుంబాలకు ఇష్టం లేదన్నట్టుగా తెలుస్తోంది. అసలు మోహన్‌బాబు ఫ్యామిలీకి యేడాది కాలంగా దూరంగా ఉంటున్నాడు మనోజ్. మౌనిక – మనోజ్ ఇద్దరూ యేడాదిన్నర కాలంగా చెన్నైలోనే ఉంటూ ఇటీవలే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే గణేష్ మండపానికి వీరిద్దరు కలిసి వచ్చి వినాయకుడిని దర్శించుకున్నప్పుడే వీరు సహజీవనంలో ఉన్నారన్న పుకార్లు వచ్చాయి.
ఇక వీరి వైవాహిక బంధం అటు మోహన్‌బాబు ఫ్యామిలీకి మాత్రమే కాదు.. ఇటు భూమి ఫ్యామిలీకి కూడా ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. మౌనిక సోదరి, మాజీ మంత్రి అఖిలప్రియ కూడా భూమా ఘాట్‌కు చేరుకునేందుకు తన భర్త భార్గవ్‌రామ్‌తో పాటు తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డితో కలిసి బయలు దేరారు. మనోజ్ – మౌనిక అక్కడ ఉన్నారని కనీసం వారిని చూసేందుకు కూడా ఇష్టపడలేదు.
వారు ఘాట్‌కు సమీపంలో ఉన్న భైరవస్వామి ఆలయానికి వెళ్లి అక్కడే ఉన్నారు. మనోజ్ – మౌనిక అక్కడ నుంచి వెళ్లాక కాని వీరు ఘాట్‌కు వెళ్లలేదు. ఏదేమైనా వీరి పెళ్లి ముహూర్తం సెట్ అయ్యింది. మరి రెండు కుటుంబాలను పెళ్లి నాటికి అయినా ఒప్పిస్తారా ? లేదా ? అన్నది చూడాలి.